General News

85 సంవత్సరాల తర్వాత…కార్బెట్‌ రిజర్వ్‌లో సందడి చేసిన శ్వేత మయూరం!

సాధారణంగా నెమలి పురివిప్పి నాట్యం ఆడితే చూడటానికి కన్ను సొంపుగా ఉంటుంది. అందమైన నీలిరంగు కలిగినటువంటి నెమలి పించం పురివిప్పి నాట్యమాడితే ఆ దృశ్యం వర్ణనాతీతం. అయితే సాధారణంగా ఈ విధమైనటువంటి నీలిరంగు నెమలి పురివిప్పి నాట్యం ఆడటం సర్వసాధారణంగా మనం చూస్తుంటాము. కానీ తెలుపు రంగులో ఉండి, పురివిప్పి నాట్యమాడే శ్వేత మయూరం కనిపించడం చాలా అరుదు. కానీ అలాంటి తెలుపు రంగు కలిగినటువంటి నెమలి తాజాగా కార్బెట్‌ టైగర్ రిజర్వ్‌లో సందడి చేసింది.

కార్బెట్‌ టైగర్‌ రిజర్వ్‌లోని కోతి రౌ సమీపంలో ఆదివారం పెట్రోలింగ్‌కు వెళ్లిన అటవీ అధికారులలకు ఈ అందమైన దృశ్యాలు కంటపడ్డాయి. సాధారణంగా ఈ రిజర్వ్ లో ఎక్కువగా బ్లూ కలర్‌ నుంచి గ్రీన్‌ వరకు అన్ని రకాల నెమలిలకు నిలయం. కానీ అక్కడ ఈ విధమైనటువంటి తెలుపు రంగులో నెమలి కనిపించడం చాలా అరుదు. గత 85 సంవత్సరాల కాలం నుంచి ఈ రిజర్వ్ లో ఈ విధమైనటువంటి నెమలి కనిపించడం ఇదే తొలిసారి.

అయితే మొదటిగా ఈ తెలుపు వర్ణంలో ఉన్నటువంటి నెమలిని చూడగానే అటవీశాఖ అధికారులు అసలు ఇది నెమల అనే సందేహం కలిగింది.ఈ విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం మరుసటి రోజు అటవీశాఖ అధికారులు అదే ప్రాంతానికి వెళ్లడంతో మరోసారి ఆ నెమలి వారి కంట పడింది. దీంతో తెలుపు వర్ణంలో నెమలి అని నిర్ధారించుకున్నట్లు రిజర్వ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ తెలిపారు.

ఈ విషయంపై అటవీశాఖ అధికారులు జోన్ లోనిసిబ్బందిని అప్రమత్తం చేసి ఈ నెమలి కదలికలపై నిఘా ఉంచమన్నారు. అదేవిధంగా ఈ రిజర్వులో ఇలాంటి నెమళ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విధమైనటువంటి తెలుపు రంగు నెమలి నీలం రంగు నెమలిలో జన్యు రూపాంతరం. ఇందులో లూసిజం అనే జన్యు పరివర్తన ఉంటుంది. ఇది నెమలి పించాలపై వర్ణద్రవ్యం లేకపోవటానికి కారణమవుతుంది. అందుకోసమే నెమలి తెలుపు రంగులో ఉంటుందని డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago