సాధారణంగా నెమలి పురివిప్పి నాట్యం ఆడితే చూడటానికి కన్ను సొంపుగా ఉంటుంది. అందమైన నీలిరంగు కలిగినటువంటి నెమలి పించం పురివిప్పి నాట్యమాడితే ఆ దృశ్యం వర్ణనాతీతం. అయితే సాధారణంగా ఈ విధమైనటువంటి నీలిరంగు నెమలి పురివిప్పి నాట్యం ఆడటం సర్వసాధారణంగా మనం చూస్తుంటాము. కానీ తెలుపు రంగులో ఉండి, పురివిప్పి నాట్యమాడే శ్వేత మయూరం కనిపించడం చాలా అరుదు. కానీ అలాంటి తెలుపు రంగు కలిగినటువంటి నెమలి తాజాగా కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో సందడి చేసింది.

కార్బెట్ టైగర్ రిజర్వ్‌లోని కోతి రౌ సమీపంలో ఆదివారం పెట్రోలింగ్‌కు వెళ్లిన అటవీ అధికారులలకు ఈ అందమైన దృశ్యాలు కంటపడ్డాయి. సాధారణంగా ఈ రిజర్వ్ లో ఎక్కువగా బ్లూ కలర్ నుంచి గ్రీన్ వరకు అన్ని రకాల నెమలిలకు నిలయం. కానీ అక్కడ ఈ విధమైనటువంటి తెలుపు రంగులో నెమలి కనిపించడం చాలా అరుదు. గత 85 సంవత్సరాల కాలం నుంచి ఈ రిజర్వ్ లో ఈ విధమైనటువంటి నెమలి కనిపించడం ఇదే తొలిసారి.
అయితే మొదటిగా ఈ తెలుపు వర్ణంలో ఉన్నటువంటి నెమలిని చూడగానే అటవీశాఖ అధికారులు అసలు ఇది నెమల అనే సందేహం కలిగింది.ఈ విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం మరుసటి రోజు అటవీశాఖ అధికారులు అదే ప్రాంతానికి వెళ్లడంతో మరోసారి ఆ నెమలి వారి కంట పడింది. దీంతో తెలుపు వర్ణంలో నెమలి అని నిర్ధారించుకున్నట్లు రిజర్వ్ డైరెక్టర్ రాహుల్ తెలిపారు.
ఈ విషయంపై అటవీశాఖ అధికారులు జోన్ లోనిసిబ్బందిని అప్రమత్తం చేసి ఈ నెమలి కదలికలపై నిఘా ఉంచమన్నారు. అదేవిధంగా ఈ రిజర్వులో ఇలాంటి నెమళ్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విధమైనటువంటి తెలుపు రంగు నెమలి నీలం రంగు నెమలిలో జన్యు రూపాంతరం. ఇందులో లూసిజం అనే జన్యు పరివర్తన ఉంటుంది. ఇది నెమలి పించాలపై వర్ణద్రవ్యం లేకపోవటానికి కారణమవుతుంది. అందుకోసమే నెమలి తెలుపు రంగులో ఉంటుందని డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు తెలిపారు.































