Ileana: దేవదాసు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాలోని తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఇలియానా ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ్ హిందీ భాషలలో కూడా స్టార్ హీరోల సరసర నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోవటంతో అడపాదడపా సినిమాలలో నటిస్తోంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఇలియానా తరచూ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఇలియానా తాను తల్లి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. పెళ్లికాకు పిల్లలు ఎలా పుడతారు అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలియానా ఒక వ్యక్తిని ప్రేమించి ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పింది.
ఇటీవల కాలంలో ఇలియానా ప్రేమ, పెళ్లి వ్యవహారం గురించి కూడా ఎటువంటి వార్తలు వినిపించలేదు. అయితే ఉన్నట్లుండి ఇలా తాను తల్లి కాబోతున్న విషయాన్ని ఇలియానా బయట పెట్టడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఇలియానా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. తాను తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన తర్వాత ఇలియానా మొదటిసారిగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసింది.
దీంతో పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ఇలియానా మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరిడితో ఇలియానా రిలేషన్ లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అతని వల్లే ఇలియానా గర్భం దాల్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలియానా ప్రెగ్నెన్సీ గురించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇలియానా మాత్రం స్పందించడం లేదు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…