Ileana: ఇలియానా ప్రస్తుతం గర్భవతి అనే విషయం మనకు తెలిసిందే. ఈమె పెళ్లి కాకుండానే తన ప్రేగ్నెన్సీ విషయాన్ని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు.ఇలా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయినటువంటి ఇలియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె మొదటిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా మాట్లాడుతూ వారు అడిగే ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలోనే ఎంతోమంది నేటిజన్స్ ఈమె ప్రెగ్నెన్సీ గురించి ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా నేటిజన్స్ ప్రశ్నిస్తూ ఈ ప్రెగ్నెన్సీ సమయంలో మీకు ఏదైనా వింతగా తినాలనిపించిందా అంటూ ప్రశ్నించగా తనకు లిటిల్ క్యారెట్స్ తినాలనిపించింది అంటూ సమాధానం చెప్పారు.
ఇక కడుపుతో ఉన్నటువంటి మహిళలు సాధారణంగా బరువు పెరగడం సహజం అయితే ఇలా బరువు పెరుగుతున్నందుకు మీకు ఎలాంటి బాధ అనిపించలేదా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరుగుతున్నందుకు తాను ఏ మాత్రం ఫీల్ అవ్వలేదని తెలియజేశారు.
మరొక నెటిజన్ ప్రశ్నిస్తూ మీరు మొదటిసారి మీ బిడ్డ గుండె చప్పుడు విన్న తర్వాత ఎలాంటి ఫీలింగ్ కలిగింది అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఇలియానా సమాధానం చెబుతూ నా బిడ్డ గుండెచప్పుడు విన్న ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇలియానా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…