Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం వరుస సినిమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నటువంటి మహేష్ బాబు సినిమాల పరంగా మాత్రమే కాకుండా తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ గడుపుతున్నారు.
ఇకపోతే మహేష్ బాబు తాజాగా ఒక ఖరీదైన కారును కొనుగోలు చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు కొనుగోలు చేసిన ఈ కారు ధర తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈయన ఎంతో ఖరీదైన రేంజ్ రోవర్ ఎస్ వి కారును కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఇలాంటి ఖరీదైన కార్లు ఎక్కువగా వ్యాపారవేత్తలు సినీ సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఈ కారు చిరంజీవి మోహన్లాల్ ఎన్టీఆర్ వంటి హీరోల వద్ద ఉంది. అయితే తాజాగా మహేష్ బాబు కూడా రేంజ్ రోవర్ కారుకు ఓనర్ గా మారిపోయారు. ఇక ఈ కారు కోసం మహేష్ బాబు ఎన్ని కోట్లు ఖర్చు చేశారనే విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఈ కారు కోసం మహేష్ బాబు అక్షరాల ఐదున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది.ఇలా అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేయడంతో ఈ విషయం తెలిసి అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక మహేష్ బాబు సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం ఈయన గుంటూరు కారం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలో బిజీ కానున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…