గోవా బ్యూటీ ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకొన్నారు. సైలైంట్ గా కాపురం కూడా చేసేస్తున్నారనే గాసిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ ఆండ్రూ.. ఇలియానా ల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఇలియానా తన ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. మళ్లీ సినిమాలపై శ్రద్ధ పెట్టింది.
ఈమధ్యనే రవితేజ నటించిన ర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ లో మళ్లీ బిజీ కావాలని ఆశ పడుతోంది. ఆ దిశగా సీరియస్ గా ప్రయత్నాలు కూడా చేస్తోంది. తాజాగా అందిన టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆమెకు నాగార్జునతో కలిసి నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలిసింది. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగార్జున హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానాను సెలెక్ట్ చేశారు. ఇక అసలు విషయానికొస్తే.. గోవా బ్యూటీ ఇలియానా ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాల గురించి ఓపెన్‌గా నోరు విప్పింది లేదు. ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ లో ఉన్నప్పుడూ కూడా జస్ట్, నా లైఫ్‌లో ఒకరున్నారని చెప్పింది కానీ మరో మాట మాట్లాడలేదు. గతంలో ఆండ్రూతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఆండ్రూతో బ్రేకప్ తర్వాత అతడు తీసిన ఫొటోలను ఈమధ్యనే తన సోషల్ మీడియా అకౌంట్స్ నుండి తొలగించింది.
ఇదే విషయాన్ని ప్రస్తావించి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆర్ యూ సింగిల్?’ అని ఒక ఫోలోవర్ అడిగాడు. ఆ ప్రశ్నకు ముందు షాకైన ఇలియానా ఆ తర్వాత కూల్ గానే రిప్లై ఇస్తూ.. ‘పరాయివాళ్ళ వ్యక్తిగత ప్రేమ విషయాలు, వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంతిలాగ ఎక్కువ ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తారో నాకర్ధం కావడంలేదు” అని ఇలియానా చెప్పింది. అదండి సంగతి.. మొత్తానికి సినీతారలకు డేటింగ్ అన్నమాట అరటిపండు ఒలిచి తిన్నంత ఈజీ అయిపోయిందన్నమాట
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…