గోవా బ్యూటీ ఇలియానా ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో చెట్టాపట్టాలేసుకొని తిరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకొన్నారు. సైలైంట్ గా కాపురం కూడా చేసేస్తున్నారనే గాసిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. కానీ ఆండ్రూ.. ఇలియానా ల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఇలియానా తన ప్రేమ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. మళ్లీ సినిమాలపై శ్రద్ధ పెట్టింది.

ఈమధ్యనే రవితేజ నటించిన ర్ అక్బర్ ఆంటోనీ చిత్రంతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టాలీవుడ్ లో మళ్లీ బిజీ కావాలని ఆశ పడుతోంది. ఆ దిశగా సీరియస్ గా ప్రయత్నాలు కూడా చేస్తోంది. తాజాగా అందిన టాలీవుడ్ సమాచారం ప్రకారం ఆమెకు నాగార్జునతో కలిసి నటించే ఛాన్స్ వచ్చినట్టు తెలిసింది. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో నాగార్జున హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా ఇలియానాను సెలెక్ట్ చేశారు. ఇక అసలు విషయానికొస్తే.. గోవా బ్యూటీ ఇలియానా ఎప్పుడూ తన ప్రేమ వ్యవహారాల గురించి ఓపెన్‌గా నోరు విప్పింది లేదు. ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ లో ఉన్నప్పుడూ కూడా జస్ట్‌, నా లైఫ్‌లో ఒకరున్నారని చెప్పింది కానీ మరో మాట మాట్లాడలేదు. గతంలో ఆండ్రూతో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేసేది. ఆండ్రూతో బ్రేకప్‌ తర్వాత అతడు తీసిన ఫొటోలను ఈమధ్యనే తన సోషల్ మీడియా అకౌంట్స్‌ నుండి తొలగించింది.

ఇదే విషయాన్ని ప్రస్తావించి ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆర్‌ యూ సింగిల్‌?’ అని ఒక ఫోలోవర్ అడిగాడు. ఆ ప్రశ్నకు ముందు షాకైన ఇలియానా ఆ తర్వాత కూల్ గానే రిప్లై ఇస్తూ.. ‘పరాయివాళ్ళ వ్యక్తిగత ప్రేమ విషయాలు, వాళ్ల జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇంతిలాగ ఎక్కువ ఇంట్రెస్ట్‌ ఎందుకు చూపిస్తారో నాకర్ధం కావడంలేదు” అని ఇలియానా చెప్పింది. అదండి సంగతి.. మొత్తానికి సినీతారలకు డేటింగ్ అన్నమాట అరటిపండు ఒలిచి తిన్నంత ఈజీ అయిపోయిందన్నమాట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here