Featured

Imandi Ramarao : తారక్ నీ పేరు మార్చుకో ఎన్టీఆర్ కాదు వైస్సార్ అని పెట్టుకో : ఇమంది రామారావు

Imandi Ramarao : ఏపీ ప్రభుత్వం హెల్త్ యూనివర్సిటీ పేరును వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్పు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ ఇష్యూ మీద టీడీపీ పార్టీ శ్రేణులు, నందమూరి కుటుంబ సభ్యులు స్పందించారు. మార్చవద్దంటూ అభిప్రాయపడ్డారు. ఇక ఎలా స్పందించిన వారిలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన మాత్రం టీడీపీ శ్రేణులకే కాదు నందమూరి అభిమానులకు రుచించలేదు. తారక్ ఇలా ఎందుకు మాట్లాడాడు, ఎన్టీఆర్ ను వైస్సార్ తో పోల్చడమేంటి అంటూ అక్షేపించారు. ఇక ఈ విషయం మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు కూడా స్పందించారు. ఎన్టీఆర్ ను చాలా ఘాటుగా విమర్శించారు.

నీ పేరు వైస్సార్ అని మార్చుకో…

ఇమంది గారు మాట్లాడుతూ ఎన్టీఆర్ ట్వీట్ బాగోలేదంటూ మాట్లాడారు. ఎన్టీఆర్, వైస్సార్ ఇద్దరినీ ఒకేలా పోల్చడం కరెక్ట్ కాదంటూ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ గారు హెల్త్ యూనివర్సిటీ కోసం పాటు పడి కట్టిస్తే ఆ సేవలకు గుర్తుగా ఆ పేరు పెట్టారు. ఇక రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చినా మళ్ళీ వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ గానే ఉంచాయి కానీ మార్చలేదు. ఆ విషయాన్ని ఇక్కడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును ఒకేలా చూడటం వైసీపీ వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. ఎన్టీఆర్ మనవడిని అంటూ చెప్పుకోవడం ఆయన ఆశీర్వాదం నాకు ఉంది అనడం కాదు ఆయన పేరు మారుస్తున్నారు అన్నపుడు కూడా స్పందించాలి.

ఎన్టీఆర్, వైస్సార్ ఒకటే అయినపుడు నువ్వు ఎన్టీఆర్ పేరు తీసేసి వైస్సార్ అని పెట్టుకో సరిపోతుంది. తారక్ నుండి ఇలాంటి స్పందన నందమూరి అభిమానులు ఆశించి ఉండరు. ఇది తన సినిమాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇటో ఆటో ఉండాలి కానీ మధ్యలో పడి బ్రతుకుతా ఎవరినీ నొప్పించను అంటే అది నీ భవిష్యత్తుకు ప్రభావం చూపుతుంది. ఇన్నిరోజులు టీడీపీ పగ్గాలను ఎన్టీఆర్ అందుకుంటాడు అంటూ భావించేవారు ఈ ఒక్క ట్వీట్ తో తారక్ చాలా పిరికివాడని అర్థమైపోయింది అంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డరు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago