Singer Divya jyothi : స్వీపర్ గా పని చేస్తున్నా తన గాత్రం తో ఒక్కసారిగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న సింగర్ దివ్యజ్యోతి. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న అంజలి అలియాస్ ఆరోహి రావు సరదాగా తీసి స్టేటస్ గా పెట్టుకున్న దివ్యజ్యోతి పాట వైరల్ అయింది. టీవీ 9 దేవి నాగవల్లి, అలాగే సుమన్ టీవీ ప్రేమ వంటి జర్నలిస్టుల వరకు వెళ్లి సెలబ్రిటీల వరకు వెళ్ళింది. ఇక రఘు కుంచె, రానా దగ్గుబాటి, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందరూ ఆమె గాత్రన్ని మెచ్చుకున్నారు. ఇక పల్సర్ బైక్ పాట తో గుర్తింపు తెచ్చుకున్న దివ్య జ్యోతి శ్రీ దేవి డ్రామా కంపెనీ లో కూడా పాల్గొని తన టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక తన ఆర్ధిక కష్టాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకుంది.
ఇంటి రెంట్ కట్టక ఏడాది అయింది…
దళిత బంధు పథకం ద్వారా రావాల్సిన డబ్బులు అందలేదు. ఇక దివ్య జ్యోతి భర్త డ్రైవర్ గా పనిచేస్తూ సంపాదించేవాడు. బొలెరో వాహనం దళిత బంధు కింద తీసుకున్నారు. అయితే రెండు సార్లు యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఆమె భర్త ఇక వాహనం నడపారాదని డాక్టర్లు చెప్పడం వల్ల సంపాదన ఆగిపోయింది. ఇక బొలెరో వాహనానికి చెల్లించాల్సిన 3 లక్షలు లేవు. అప్పు చేయాలన్నా ఎవరూ ఇవ్వరు. ఇక మిగిలిన 3 లక్షలు కట్టేస్తే కానీ మళ్ళీ దళిత బంధు కింద డబ్బు రాదు.
ఇంటి అద్దె చెల్లించడానికి 4 వేలు లేక అల్లాడుతున్న నాకు 3 లక్షలు ఎక్కడినుండి తేవాలి. ఏడాది నుండి ఇంటి అద్దె చెల్లించలేదు. ఓనర్ రోజూ తిడుతోంది. కేటీఆర్ గారు ట్యాంక్ బండ్ శివ వంటి వారికి ఇల్లు కట్టుకోడానికి సహాయం చేసారు. మాలాంటి వాళ్లను కూడా పట్టించుకోవచ్చు కదా అని దివ్యజ్యోతి అడిగారు. వచ్చే పదివేల జీతం లో ఇంటిని గడపాలి, ఇక కలెక్టర్ ఆఫీస్ కి కూడా తిరగాలి, డబ్బులేమీ మిగలవు ఇంట్లో నా భర్త కోసం వైద్యం కూడా చేయించాలి అంటూ ఎమోషనల్ అయింది దివ్యజ్యోతి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…