ఈ సంవత్సరం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువగా హిట్ అయిన సినిమాల్లో చెప్పుకునేవి లవ్ స్టోరీ మరియు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఇద్దరు బ్రదర్స్ బంపర్ హిట్ కొట్టేశారు. ఇది అక్కినేని ఫ్యామిలీకి డబుల్ సందడి అనే చెప్పాలి.
ఇదిలా ఉండగా.. త్వరలోనే మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాను ఆహా ఓటీటీలో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఆహా విడుదల చేసింది. థియేటర్లలో సినిమా చూడని వారు ఇంకా ఉంటే.. ఈ ట్రైలర్ ను మీరూ చూసేయండి. ఇక సినిమా విషయానికి వస్తే.. బొమ్మరిల్లు భాస్కర్ కు గత కొన్ని సంవత్సరాల నుంచి మంచి హిట్ దొరకలేదు.
ఒకానొక సమయంలో అతడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారట.. కనీసం దర్శకత్వం వహించడానికి సినిమాలు చేతిలో లేక ఎన్నో కష్టాలను అనుభవించారట. ఇకపోతే.. ఈ సినిమాకు అల్లు అరవింద్ అతడికి నెలకు శాలరీ చొప్పున పారితోషికం ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పటికీ ఉంటుంది.
చాలా రోజుల తరువాత బొమ్మరిల్లు భాస్కర్‌కు మళ్లీ సక్సెస్ వచ్చినట్టు అయింది. దీనిలో హీరోగా నటించిన అఖిల్ అక్కినేనికి కూడా చాలారోజుల నుంచి మంచి హిట్ దొరకలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరింది. దీంతో బొమ్మరిల్లు భాస్కర్ కు, అక్కినేని అఖిల్ కు ఈ సినిమా వాళ్ల కెరీర్ కు పెద్ద ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. ఇప్పటికే లవ్ స్టోరీ సినిమా ఆహాలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…