తెలుగులో ప్రసారం అయిన బిగ్‌బాస్ ఐదో సీజన్ పూర్తయింది. 105 రోజుల ఈ జర్నీ ఎట్టకేలకు మొన్న గ్రాండ్ గా ముగిసింది. అయితే హౌస్ లో 19 మంది కంటెస్టెంట్లు అడుపెట్టగా.. మొదటి వీక్ లో సరయు ఎలిమినేట్ అయింది.
తర్వాత స్ట్రాంగ్ అనుకున్న కంటెస్టెంట్లు అందరూ హౌజ్ నుంచి బయటకు వచ్చేశారు. అందులో ముఖ్యంగా యాంకర్ రవి బయటకు రావడం అటు అభిమానులకు.. సగటు ప్రేక్షకుడికి రుచించలేదు. ఎలిమినేషన్ అంతా ఫేక్ అంటూ ఆరోపించారు. అంతక ముందు విశ్వా విషయంలో కూడా అంతే జరిగింది.
ఆటలో ఎంతో చురుకుగా ఉండే విశ్వా కూడా హౌస్ నుంచి అనూహ్యంగా బయటకు వచ్చాడు. ఇక టాప్ 5లో మిగిలిన సిరి, మానస్, సన్నీ, షణ్ముఖ్ మరియు శ్రీరామంచంద్రలు మిగిలారు. ఇందులో మొదట సిరి ఎలిమినేట్ కాగా.. తర్వాత టాప్ 4 గా మానస్ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. తర్వాత శ్రీరామచంద్ర టాప్ 3 గా బయటకు వచ్చేశారు.ఇక హౌస్ నుంచి వచ్చిన వాళ్లు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు.
ఈ విషయాలను తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికి ఉంటుంది. ఈ విషయంలో సోషల్ మీడియాలో తెగ వెతుకుతుంటారు. అయితే తాజాగా ఇండియన్ ఐడల్ 5 విజేత శ్రీరామ్ కు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారో తెలిసిపోయింది. ఆ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడికి వారానికి రూ. రెండు నుంచి రూ.3లక్షల చొప్పున అందుకున్నాడట. అతడు మొత్తం 15 వారాలు హౌస్ లో ఉన్నాడు. దీనిని బట్టి చూస్తే అతడు మొత్తంగా రూ. 35 లక్షల వరకు సంపాదించాడని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…