Movie News

Indraja : పెళ్ళికి ముందు ఇంద్రజ భర్తకు ఎలాంటి షరతులు పెట్టిందో తెలుసా..?

Indraja : తెలుగులో ‘జంతర్ మంతర్’ సినిమాతో ఇంద్రజ ప్రేక్షకుల ముందుకు వచ్చినా అలీ హీరోగా వచ్చిన యమలీల సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తరువాత ఇంద్రజకు వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం ఇంద్రజ బుల్లితెర మీద కొన్ని ప్రోగ్రాములకు న్యాయనిర్ణేతగా వ్యవహారిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఇంద్రజ తనకు సంగీతం, నృత్యంపై అభిరుచి అమ్మ ద్వారానే వచ్చిందని చెప్పారు. ఎమ్.వీ.ఎన్. మూర్తి దగ్గర కూచిపూడి నృత్యాన్ని, తంగం మేడమ్ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నానని ఇంద్రజ చెప్పారు.

అమ్మ నాన్న బాగోగులు నేనే చూసుకుంటాను అని…

యమలీల సినిమా సమయంలో అలీ గారి గురించి చెప్తూ.. అలీ సినిమాలలో ఎలా ఉంటారో బయట కూడా అలానే ఉంటారని అన్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ గురించి చెబుతూ.. ఆయనకు అన్ని క్రాఫ్ట్ లు తెలుసని, ఆయనను నేను డైరెక్షన్ చేయాలని కోరినట్లు ఇంద్రజ చెప్పుకొచ్చారు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సినిమా అవకాశాలు వచ్చాయని అందులో 3 సినిమాలు చేశానని చెప్పారు.

ఇక పెళ్లి గురించి చెబుతూ.. మాది ప్రేమ వివాహం అయితే పెళ్లి తరువాత రిసెప్షన్, హనీమూన్ లాంటివి ఏమీ జరగలేదని చేప్పుకొచ్చారు. పెళ్ళికి ముందు మీ ఆయనకు ఏమైనా షరతులు పెట్టారా అన్న ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పారు.. మా అమ్మ, నాన్న నాతోనే ఉంటారని వాళ్లను వదిలేసి నేను రాలేనని, వారి బాగోగులు నేనే చూసుకుంటానని చెప్పారట. అంతేకాదు చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా నాపై ఉంటుందని కూడా చెప్పానని ఇంద్రజ చెప్పుకొచ్చారు.

Bhargavi

Recent Posts

రాజకీయాలకు ఆధ్యాత్మిక టచ్.. విజయ్ వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది!

తమిళ సినీ నటుడు, తమిళక వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్ తాజాగా రాజకీయ కార్యక్రమాల్లో భాగంగా ఆధ్యాత్మిక…

15 minutes ago

చార్‌ధామ్ యాత్ర ప్రారంభం.. యమునోత్రి, గంగోత్రి దర్శనాలకు భారీగా తరలివచ్చిన భక్తులు!

ఉత్తరాఖండ్‌లో ప్రతి ఏడాది భక్తుల ఆధ్యాత్మిక ఆశలను నెరవేర్చే చార్‌ధామ్ యాత్ర ఈసారి కూడా ఘనంగా ప్రారంభమైంది. అక్షయ తృతీయ…

45 minutes ago

నా మాటలను వక్రీకరించారు.. ప్రకాశ్ రాజ్ క్లారిటీ

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…

21 hours ago

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

1 day ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

1 day ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

1 day ago