Categories: FeaturedMovie News

Mirchi Madhavi : శతమానంభవతి సినిమా టైములో చాలా బాధపడ్డాను… నా మీద జోకులు వేసుకున్నారు : మిర్చి మాధవి

Mirchi Madhavi : తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ గుర్తింపు తో దూసుకుపోతున్న నటి ఊట్ల మాధవి. కానీ మిర్చి మాధవి గా సినిమాల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట రేడియో జాకీ గా తన కెరీర్ మొదలు పెట్టిన మాధవి ఆ తరువాత ఆర్టిస్ట్ గా సినిమాల్లో ప్రయాణాన్ని మొదలు పెట్టారు. చాలా సినిమాల్లో అత్త, వదిన, తల్లి పాత్రలతో మెప్పించిన మాధవి ఎన్టీఆర్ కథానాయకుడు, రామ చక్కని సీత, జోడి, శతమానం భవతి వంటి సినిమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంది. తాజాగా యూట్యూబ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న మాధవి ఇండస్ట్రీలో ప్రస్తుతం నడుస్తున్న నిర్మాత సమస్యల కోసం షూటింగుల బంద్ టాపిక్ గురించి స్పందించింది.

శతమానం భవతి టైములో నన్ను ఎగతాళి చేసారు…

ఇండస్ట్రీ లో జరుగుతున్న విషయాల గురించి మిర్చి మాధవి మాట్లాడుతూ షూటింగుల బంద్ వివాదం గురించి మాట్లాడారు. ఆర్టిస్ట్ల వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు, రెమ్యూనరేషన్ లు తగ్గించుకోవాలని వస్తున్న సూచన గురించి మాట్లాడుతూ సినిమా ప్రారంభం లోనే అగ్రిమెంట్ చేసుకునే సమయంలోని క్లియర్ గా విషయాలు మాట్లాడుకుంటే సరిపోతుంది. పలానా ఆర్టిస్ట్ ఉంటేనే సినిమాలో ప్లస్ అవుతుందని నిర్మాత భావించినప్పుడు అతనికి ఉన్న మైంటైనన్స్ బట్టి అతని సిబ్బంది ఉంటారు అవన్నీ తెలుసుకున్నాకే కదా సినిమాలో తీసుకుంటారు. ఇక ఇతర భాషల వాళ్ళను క్యారెక్టర్ ఆర్టిస్ట్ల గా తీసుకోవడం గురించి కూడా మాధవి స్పందించారు. సినిమా హిట్ అయి డబ్బు రావాలనే ఎవరైనా సినిమా తీస్తారు. అలాంటప్పుడు ఏ వ్యక్తిని పెట్టుకుంటే సినిమాకు మంచిదో అలాంటి వాళ్ళను పెట్టుకుంటారు. మన తెలుగు వాళ్లనే పెట్టుకోవాలి అంటే సినిమా పోతే ఆ నష్టం వాళ్ళు భరించరు కదా అని మాధవి అభిప్రాయపడ్డారు. ఒక ప్లేట్ లో ఏమి వడ్డించుకుని తినాలన్నది నీ ఇష్టం.

అలాగే సినిమా కూడా ఆ నిర్మాత, డైరెక్టర్ సినిమాకు ఎవరు బాగుంటారో వాళ్ళను బట్టి సినిమా కు కావాల్సిన వాళ్లను ఎంపిక చేస్తారు అని అభిప్రాయ పడ్డారు. ఇక శతమానం భవతి సినిమా షూటింగ్ సమయంలో తనకు చేదు అనుభవం ఎదురైందనీ చెప్పారు. షూటింగ్ సమయంలో అందరూ ఆర్టిస్టులు మాట్లాడుకుంటూ ఉండగా నా ఫ్రెండ్ అనుకున్న ఆర్టిస్ట్ నన్ను వెటకారంగా వెకిలిగా వెక్కిరించి నవ్వుకోవడం ఇతరులతో కలిసి నాకు నచ్చలేదు. ఆది యిప్పుడు జరుగుంటే పెద్దగా పట్టించుకుని ఉండేదాన్ని కాదు. అప్పుడు ఇంకా నాకు అంత మెచూరిటీ లేదు అందుకే చాలా బాధ పడ్డాను. అంటూ అప్పటి సంగతులను పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago