Natti Kumar : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ ఫిల్మ్ న్యూస్ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రాబోతోంది. అందులోనూ ఎన్టీఆర్ కు కొమరం భీమ్ పాత్రకు ఆస్కార్ నామినేట్ అయ్యే లిస్ట్ లో ఉన్నాడు అన్న వార్త బాగా వైరల్ అవుతుంది. వెరైటీ అనే ఇంగ్లీష్ మాగజైన్ ప్రకటించిన నామినేషన్ లిస్ట్ లో ఆసియా నుండి ఎన్టీఆర్ పేరు ఉండటంతో ఇపుడు ఈ వార్త హైలైట్ అయింది. ఇక ఈ విషయాల పై నట్టి కుమార్ మాట్లాడారు.
ఆర్ఆర్ఆర్ కి అవార్డు వస్తే అది శుభపరిణామమే…
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఏ విభాగం లో అవార్డ్ వచ్చినా సంతోషమే. ఇంతవరకు తెలుగు సినిమాకు ఆస్కార్ రాలేదు కాబట్టి ఇపుడు రాజమౌళి సినిమాకు అవార్డు వస్తే తెలుగు సినిమాకు మరింత గుర్తింపు వస్తుంది అంటూ స్పందించారు. ఇక కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ చరణ్ నటన చాలా బాగున్నాయి. ఇద్దరిలో ఎవరికి అవార్డు వచ్చినా అది తెలుగు ఖ్యాతిని పెంచేదే అవుతుంది. అయితే ఎన్టీఆర్ లిస్ట్ లో ఉన్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇంకా స్పష్టంగా తెలియదు. ఒక వేళ అది నిజమే అయితే సంతోషమే. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏదో ఒక కేటగిరి లో అవార్డు మాత్రం ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం అందరికీ నమ్మకం ఉంది అంటూ వివరించారు.
ఇక రాజమౌళి సినిమా అంటే అది ఒక బ్రాండు, అయన సినిమా కు అయన టికెట్ ధర పెంచమని అడిగాడు. అంతే కానీ అన్ని సినిమాలకు రేట్లు పెంచమని అడుగలేదు. ఆయన సినిమా ఇండస్ట్రీ ని నాశనం చేస్తున్నాడు అనడం తప్పు. ఇక ఒకవేళ ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డులను అందుకుంటే ఇక రాజమౌళికి మరింత తల పొగరు పెరుగుతుంది అంటూ వచ్చిన వాఖ్యల పైన స్పందించారు. రాజమౌళి అలా మారుతాడని నేను అనుకోవడం లేదు. ఆయన ప్రతి సినిమాకు చాలా కష్టపడి తీస్తారు అలాగే మార్కెటింగ్ కూడా అలానే చేస్తారు అంతే కానీ ఆయనకు పొగరు పెరిగి పోయి ఉంటే ఇన్ని సినిమాలు విజయాన్ని అందుకోవు అంటూ నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…