Indraja : సుధీర్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. ఒక మెజీషియన్ గా తన కెరీర్ ని ప్రారంభించిన సుధీర్ 2013లో ప్రారంభం అయిన జబర్దస్త్ ప్రోగ్రాం వలన తెలుగు బుల్లితెరకి పరిచయం అయినాడు. జబర్దస్త్ ప్రోగ్రాంలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. శీను, రామ్ ప్రసాద్ తో కలసి టీమ్ లీడర్ గా స్కిట్లు చేస్తూ అభిమానులను సొంంతం చేసుకున్నాడు. జబర్దస్త్ మాత్రమే కాకుండా నా షో నా ఇష్టం, పోవే పోరా, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి ప్రోగ్రాములకు హోస్ట్ గా వ్యవహారించాడు. కేవలం బుల్లితెర మీదనే కాకుండా వెండితేరా మీద కూడా అల్లరిస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ హీరోగా సినిమాలు తీస్తున్నాడు.
వాంటెడ్, పండుగాడు సినిమాలతో హీరోగా స్థిరపడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్న వార్తలు కూడా వస్తున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ లో సుధీర్ హీరోయిన్ ఇంద్రజ తో కలసి షో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ సుధీర్ ఎందుకు జబర్దస్త్ వీడాడో, తనకి సుధీర్ తో వున్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
సుధీర్ జబర్దస్త్ ఎందుకు వీడాడో నాకు తెలుసు.. కానీ…
సుధీర్ కు జబర్దస్త్ షో వలనే క్రేజ్ వచ్చింది అనడం లో ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటిది సుధీర్ జబర్దస్త్ తో పాటు మరికొన్ని ప్రోగ్రాములకు ఎందుకు గుడ్ బై చెప్పాడు అని అభిమానులలో చాలా ప్రశ్నలు వున్నాయి. అయితే ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ తాను షోలలో సుధీర్ ని చాలా మిస్ అవుతున్నాని పేర్కొన్నారు. తనకన్నా వయసులో 8ఏళ్ళే చిన్నవాడు అయినప్పటికీ మా ఇద్దరి మధ్య తల్లి కొడుకుల అనుబంధం చాలా బాగా ఉంటుందని చెప్పారు.
ఇక సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్ళడానికి కారణం గురించి అడుగగా.. దానికి సమాధానం నాకు తెలుసు కానీ, ఇంకొకరి వ్యక్తిగత విషయాలను గురించి నేను మాట్లాడను అని సూటిగా చెప్పేసారు. సుధీర్, శీను, ఆది జబర్దస్త్ లో లేకపోవడం కారణంగా రేటింగులు తగ్గాయా అన్న ప్రశ్నకు కూడా అది నాకు సంబందించినది కాదు అంటూ.. మరోసారి దాటేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…