Geethakrishna : రోజుకో ఇష్యూ గురించి తనకు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తున్న డైరెక్టర్ గీతాకృష్ణ వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా అందరి గురించి మాట్లాడుతున్నాడు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి హాట్ కామెంట్స్ చేసాడు. బాలీవుడ్ నన్ను భరించలేదని మహేష్ అన్న మాటలకు స్పందించాడు గీతాకృష్ణ. ఇక సమంతకి వరుసగా వస్తున్న బాలీవుడ్ ఆఫర్లపైన మాట్లాడారు.
మహేష్ తెలియక ఏదో వాగేసాడు…
సౌత్ సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటుతున్న నేపథ్యంలో ఆ మధ్య మహేష్ ను బాలీవుడ్ ఎంట్రీ గురించి మీడియా అడిగినపుడు బాలీవుడ్ నన్ను భరించలేదని మహేష్ అన్నారు. ఇక ఈ విషయం పై గీతా కృష్ణ స్పందించారు. ఆరోజు తొందర్లో తెలియక నోరు జారీ వాగేసాడు, మహేష్ బాలీవుడ్ మార్కెట్ వద్దని ఎందుకు అనుకుంటాడు. బాహుబలి, కేజీఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలతో సౌత్ జెండా బాలీవుడ్ లో ఎగరేశారు మన దర్శకులు, స్టార్లు. ఇక నెక్స్ట్ రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే కాబట్టి రాజమౌళి ఎప్పటిలాగే అన్ని భాషల నుండి నటులను తీసుకుంటాడు. కచ్చితంగా హీరోయిన్ ను బాలీవుడ్ నుండే తీసుకుంటాడు. అది కాదనడానికి మహేష్ కి అధికారం లేదు. ఇక చూస్తే మహేష్ భార్య నమ్రత కూడా బాలీవుడ్ నుండి వచ్చింది కదా, అలాంటప్పుడు బాలీవుడ్ వద్దనుకోవడం ఏంటి అది కేవలం తెలియక వాగడమే అంతే అంటూ స్పందించాడు.
విడాకుల తరువాత సమంత ఎక్కడికో వెళ్ళింది…
ఇక సమంత కెరీర్ మీద స్పందించిన గీతాకృష్ణ, చైతూ సామ్ విడిపోతారని ఎప్పుడో చెప్పానని, ఇంకా ఎంతో కెరీర్ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇక సమంత కెరీర్ విడాకుల తరువాత దూసుకెళ్తోందని మాట్లాడారు. అటు బాలీవుడ్, ఇటు సౌత్ సినిమాలతో బిజీగా ఉందని ఇంకో ఐదేళ్లు ఇలానే తన కెరీర్ ఉంటుందని తనకు అదృష్టం చాలా ఎక్కువని కేవలం పాకెట్ మనీ కోసం యాడ్స్ చేసింది కానీ అనుకోకుండా నటిగా మారి ఇంత క్రేజ్ సంపాదించుకుందని చెప్పారు గీతా కృష్ణ.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…