Aham Brahmasmi: అహం బ్రహ్మాస్మి సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్..కారణం అదేనా?
Aham Brahmasmi: మంచు మోహన్ బాబు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో పలు విలక్షణ పాత్రలో నటించిన నటుడు మంచు మనోజ్ అనంతరం హీరోగా కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు పొందారు. తన భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలలో నటించడానికి పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఈ క్రమంలోనే ఈయన గత కొంత కాలం నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
మంచు మనోజ్ ఇకపై సినిమాలకు దూరమవుతూ పలు వ్యాపారాలను చూసుకుంటున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సమయంలో ఆ వార్తలను కొట్టి పారేసి ఈయనఅహం బ్రహ్మాస్మి అనే ప్రాజెక్టు గురించి అనౌన్స్ చేశారు.ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. అయితే ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమాను దాదాపు అందరు మరిచిపోయారు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా కోసం మనోజ్ కాస్త బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు రావడంతో తిరిగి ఈ సినిమా పట్టాలెక్కుతోందని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం మనోజ్ ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. అందుకే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందో లేదో తెలియని పక్షంలో దర్శకుడు ఈ సినిమా కోసం తాను ఎదురు చూడలేనని అందుకే ఈ సినిమాకి గుడ్ బై చెబుతూ మరొక హీరోతో సినిమా చేయాలనే నిర్ణయం తీసుకున్నారట.
ఈ క్రమంలోనే దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి మెగా హీరో వైష్ణవ్ తేజ్ తో మరో ప్రాజెక్టు మొదలు పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియో విడుదల చేయడంతో ఆ వీడియోలో డైలాగ్స్ వింటుంటే ‘అహం బ్రహ్మాస్మి’ ప్రాజెక్ట్ నే డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మెగా హీరోతో చేస్తున్నారా అనే సందేహాలు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…