కే.ఆర్. విజయ గారే ట్రైన్ లో వస్తానంటే ఇంద్రజకి ఫ్లైట్ కావాలట.. ఆమె కంటే గొప్పా.. : డైరెక్టర్ సాగర్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ గా, ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన ఘనత డైరెక్టర్ సాగర్ గారికి ఉందని చెప్పవచ్చు. ఈయన కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలకు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. అయితే డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయారని చెప్పవచ్చు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్ సాగర్ మూడు సార్లు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ సాగర్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే సాగర్ దర్శకత్వంలో కృష్ణ హీరోగా మౌళి క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో తెరకెక్కిన చిత్రం జగదేకవీరుడు. ఈ సినిమాలో ఎంతోమంది పేరున్న నటీ నటులు నటించారు.

ఈ క్రమంలోనే సాగర్ ఈ చిత్రంలో జరిగిన ఒక సన్నివేశాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ చిత్రంలో కె ఆర్ విజయ గారు కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఎక్కువ భాగం మైసూరు, అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. కెఆర్ విజయ గారికి సొంతంగా ఫ్లైట్స్ ఉన్నప్పటికీ ఆమె బెంగళూరు ఫ్లైట్ లో వచ్చి బెంగళూరు నుంచి కారులో మద్రాసుకు రావడం ఇబ్బందిగా ఉందని, ట్రైన్లో వస్తానని చెప్పారు. విజయ గారు ఈ విధంగా చెప్పడంతో కె.ఆర్.విజయతో పాటు ఇంద్రజకి కూడా ట్రైన్ లో రమ్మని చెప్పాను.

ఈ క్రమంలోనే ఇంద్రజ మేనేజర్ దగ్గరికి వెళ్లి తనకు ట్రైన్ పడదని వాంతులవుతాయని చెప్పారు. ఇదే విషయం డైరెక్టర్ సాగర్ వద్దకు వెళ్తే.. ఇప్పటివరకు తాను ట్రైన్ లో వాంతులు అవుతాయన్న విషయం గురించి వినలేదు సరే ఇంద్రజ గారికి ఫ్లైట్ లో రమ్మనండి అని చెప్పారు. అయితే సెట్ లో ఉన్న అందరికీ సాగర్ గారు వార్నింగ్ ఇచ్చారు. ఇంద్రజతో ఎవరు మాట్లాడకూడదు.ఏదైనా అవసరం వస్తే డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పండి అంటూ అందరికీ చాలా స్ట్రిక్ట్ గా చెప్పానని ఈ సందర్భంగా డైరెక్టర్ సాగర్ తెలియజేశారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ చెప్పినట్లు సెట్ లో మూడు రోజులు ఎవరు ఇంద్రజతో మాట్లాడకపోవడంతో సరాసరి డైరెక్టర్ దగ్గరికి వెళ్లి ఏడ్చినట్లు డైరెక్టర్ తెలిపారు.అలా ఇంద్రజ ఏడవడంతో నువ్వు ట్రైన్లో జర్నీ చేస్తేనే వాంతులు చేసుకుంటావమ్మ, ఏడిస్తే కూడా వాంతులు చేసుకుంటావేమో ఏడవద్దు అంటూ ఇంద్రజకు చెప్పినట్లు ఈ సందర్భంగా ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటన డైరెక్టర్ సాగర్ తెలిపారు.