Featured

ఆర్జీవీకి షాక్ ఇచ్చిన పీవీఆర్, ఐనాక్స్..!మీ సినిమా మేము ప్రదర్శించలేము..

Ram Gopal Varma new film getting troubles :
ఈయన ఏం చేసిన అందులో కావాల్సినంత ప్రచారాన్ని చేసుకుంటాడు ఆయన ఎవరో కాదు వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. అపుడు వివాదాల మధ్య ఉండే ఈయన మరోసారి సినిమా తీసి కాంట్రవర్సీ క్రియేట్ చేసాడు. ఆర్జీవి కొత్తగా తీసిన చిత్రం ‘మా ఇష్టం ‘. ఈయన లాగే సినిమా టైటిల్ కూడా పెట్టేసాడు. ఇక ఈ సినిమా ఇద్దరు లెస్బియన్స్ ప్రేమ కథ క్రైమ్ యాక్షన్ సైకో థ్రిల్లర్ మూవీ.

మేము ప్రదర్శించలేము అన్న పీవీఆర్, ఐనాక్స్….

అప్సర రాణి, నైనా గంగూలీ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఏప్రిల్‌ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో ‘మా ఇష్టం’ పేరుతో హిందీ లో ‘ఖాత్రా ‘ పేరుతో విడుదల కాబోతుంది. ఇద్దరమ్మాయిల మధ్య కలిగిన ప్రేమ ఎలాంటి పరిస్థితులకి దారి తీసింది? అనే థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

డేంజరస్” క్రైమ్ థ్రిల్లర్-డ్రామా. ఈ సినిమా అనేది సెక్షన్ 377 రద్దు తర్వాత ఇద్దరు మహిళల మధ్య సాగే ప్రేమకథ. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ను జారీ చేసింది. అయితే లెస్బియన్ నేపథ్యంలో మూవీ కావడంతో ఈ మూవీని ప్రదర్శించడానికి కొన్ని థియేటర్లు నిరకరించాయి.

ఈ విషయాన్నీ ఆర్జీవి సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ మూవీని ప్రదర్శించేందుకు పీవీఆర్‌, ఐనాక్స్‌ థియేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో ఆయన ట్వీట్‌ చేస్తూ.. పీవీఆర్‌, ఐనాక్స్‌ డేంజరస్‌‌ సినిమాను ప్రదర్శించడానికి నిరాకరించినట్లు తెలిపాడు. అంతేకాదు ఈ మూవీ పట్ల వారు వ్యవహరించిన తీరు సుప్రీం కోర్టు తీర్పునే వ్యతిరేకించేలా ఉందన్నాడు.

లేసిబీయన్స్ కథాంశం కావడంతో తమ సినిమా ను ప్రదర్శించడానికి పీవీఆర్, ఐనాక్స్ నిరాకరించాయని సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడం లాంటిదేనని సెన్సర్ బోర్డు ఆమోదించాక కూడా వ్యతిరేకించడం ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఉన్నట్టే. అంటే పీవీఆర్‌, ఐనాక్స్ యాజమాన్యాలు ఎల్‌జీబీటీని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ కమ్యూనిటీ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నా’ అంటూ వర్మ రాసుకొచ్చాడు. ఈ విష‌యం ఇప్పుడు చర్చకు దారితీసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago