Featured

బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని దక్కించుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా జబర్దస్త్ కమెడియన్ సాయి తేజ ఉరఫ్ ప్రియాంక సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

ప్రియాంక సింగ్ అబ్బాయిగా పుట్టినప్పటికీ సర్జరీల ద్వారా అమ్మాయిగా మారి తన పేరును సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్ గా మార్చుకున్నారు.తెరపై కామెడీ చేస్తూ అందరినీ నవ్విస్తూ ఉన్నటువంటి ఈమె నిజ జీవితంలో ఎన్నో విషాదాలు ఉన్నాయని పలు సందర్భాలలో తెలియజేసింది.ప్రపంచానికి తను ఒక అబ్బాయి సాయితేజగా తెలిసినప్పటికీ తనకు చిన్నప్పటి నుంచి అమ్మాయిగా మారాలని ఎంతో ఇష్టంగా ఉండేదని,చిన్నప్పటి నుంచి అక్క డ్రస్సులు వేసుకోవడం అక్క చీరలు కట్టుకోవడం వల్ల అమ్మాయిగా మారాలనే కోరిక బలంగా మారిందని తెలిపారు.

అయితే ఈ విషయం తన తల్లిదండ్రుల దగ్గర చెబితే కాదంటారన్న ఉద్దేశంతో తన స్నేహితుల సహాయం తీసుకొని ఎంతో డబ్బుఖర్చు చేసి సర్జరీల ద్వారా అమ్మాయిగా మారానని అయితే ఈ విషయం తన తండ్రికి ఇప్పటికీ తెలియదని ఈమె బిగ్ బాస్ వేదికపై ఈ విషయాన్ని బయటపెట్టారు. లక్షలు డబ్బును ఖర్చు చేసి సర్జరీ తర్వాత తొమ్మిది నెలల పాటు ఎంతో నరకం అనుభవించానని ప్రియాంక తను పడిన కష్టాన్ని వెల్లడించారు.

సాయి తేజ నుంచి ప్రియాంకగా మారిన తర్వాత కూడా ఈమెకు అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. అయితే ఈమె సర్జరీ ఎక్కడ చేయించుకున్నారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఆ విషయాలన్నీ పూర్తిగా నా వ్యక్తిగతమని,సర్జరీ చేయించుకోవడం కోసం లక్షల్లో డబ్బు ఖర్చు అయిందనే విషయాన్ని మాత్రమే వెల్లడించారు. ఇక అమ్మాయిగా మారిన తర్వాత అవకాశాల కోసం గ్లామరస్ ఫోటోలను నిత్యం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తను పూర్తిస్థాయిలో అమ్మాయినని, తన సాయితేజ కాదనే విషయాన్ని ఎన్నో సందర్భాలలో వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బంగారం ధరలో స్వల్ప ఉపశమనం.. ఇవాళ తులం రేటు ఎంతంటే?

కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు ఒకరోజు ఒకలా మారుతూ కొనుగోలుదారులను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. భారీ పెరుగుదల తర్వాత ఒక్కసారిగా…

9 minutes ago

విజయ్–రష్మిక పెళ్లి రాజస్థాన్‌లో ఘనంగా.. అతిథులందరికీ ప్రత్యేక నిబంధనలు!

 సినీ పరిశ్రమలో ఆన్‌స్క్రీన్ జంటలు నిజ జీవితంలో ఒక్కటవ్వడం అరుదు కాదు. ఇప్పుడు అలాంటి చర్చల మధ్య నిలిచిన జంటగా…

22 minutes ago

మైసూర్ సిల్క్ మోజు.. ఒక్క చీర ధర లక్షల్లో… మహిళల భారీ రద్దీ!!

మైసూర్ పట్టు చీరల క్రేజ్… లక్షల ధరైనా వెనక్కి తగ్గని మహిళలు పట్టు చీర అంటే భారతీయ మహిళలకు ప్రత్యేకమైన…

27 minutes ago

మహాశివరాత్రి సందడి.. శ్రీశైలం మల్లన్న హుండీకి 13 రోజుల్లోనే రూ.5.61 కోట్లు!

మహాశివరాత్రి వేళ భక్తుల రద్దీతో కళకళలాడిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం మరోసారి విశ్వాసానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.…

57 minutes ago

“బొప్పాయి అందరికీ మంచిదేనా? ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్త!”

పండ్లలో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చేది బొప్పాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉండే ఈ…

1 hour ago

రాత్రి మిగిలిన అన్నం పారేస్తున్నారా? తెలుసుకుంటే ఇక వెతికి మరీ తింటారు!

చాలామంది ఇళ్లలో ఒకే సీన్ కనిపిస్తుంది. రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్నే చెత్తబుట్టలో పడేయడం. “పాత అన్నం తింటే కడుపు…

2 hours ago