బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలైపోయింది.. ప్రతి ఏట జరిగినట్టుగానే గ్రాండ్ గా బిగ్ బాస్ 5వ సీజన్ మొదలు పెట్టారు ఆ షో నిర్వాహకులు. మరోవైపు కంటెస్టెంట్స్ అందరూ తమకు ఎటువంటి ప్లాన్ లేదని.. అసలు గేమ్ ప్లాన్ అంటే తెలియదంటూ చెప్పుకొచ్చారు. ఎటువంటి ప్లాన్స్ లేకుండానే బిగ్ బాస్ గేమ్ షోకు వచ్చామని.. హౌస్ లోని పరిస్థితులను బట్టి ఏం చేయాలో ఆలోచిస్తామంటూ చెప్పుకొచ్చారు.
ఇక బిగ్ బాస్ అంటేనే అనేక వివాదాలు, గొడవలు రచ్చ రచ్చ.. ఇలాంటి షోలోకి మృదు స్వభావి అయిన మామిళ్ల శైలజ ప్రియ ఎంట్రీ ఇచ్చారు.. 7వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మామిళ్ళ శైలజ ప్రియ సినిమాల్లో అక్క, వదిన, తల్లి, పిన్ని, అత్త పాత్రలో నటిస్తూ అందరికీ సుపరిచితమే.. ఇక ఆమె గురించి తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో మే 20 వ తేదీన, 1978 వ సంవత్సరంలో జన్మించిన మామిళ్ల శైలజా ప్రియ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. 1998లో చిరంజీవి హీరోగా నటించిన మాస్టారు సినిమాలో మొట్టమొదటిగా నటించిన శైలజా ప్రియ అంతకుముందు సీరియల్ లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రియసఖి సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన శైలజా ప్రియ పేరు ప్రియ సఖి ప్రియ గా మారిపోయింది. ప్రియా ఓ ప్రియా, ప్రియా నిను చూడలేక సీరియల్ లలో శైలజా ప్రియ నటించి బుల్లితెర స్టార్ నటీమణిగా పేరు తెచ్చుకుంది.
ఆమె వయస్సు 43 సంవత్సరాలు.. 1978 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్లలో జన్మించిన శైలజా ప్రియ 2002వ సంవత్సరంలో ఎం.వి.ఎస్ కిషోర్ ని పెళ్లి చేసుకుంది. 2003వ సంవత్సరంలో ఆమెకు ఒక బాలుడు జన్మించాడు.
ఈటీవీ లో ప్రసారమైన లేడీ డిటెక్టివ్, సంఘర్షణ, పెళ్లి చేసుకుందాం & జ్వాలా సీరియల్ లో కీలకమైన పాత్రలలో శైలజా ప్రియ నటించింది. జెమినీ టీవీలో ప్రసారమైన డైరీ ఆఫ్ మిసెస్ శారదా, కొత్త బంగారం సీరియళ్లలో నటించింది. మాటీవీ లో ప్రసారమైన మనసా లో దూరదర్శన్ లో వైదేహి సీరియల్లో, జీ టీవీకి చిన్న కోడాలు లో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. తమిళంలో ప్రసారమైన సీరియల్ నాగమ్మ లో ఈమె నటించింది. ఆమె యేహి హై జిందగీ అనే హిందీ సీరియల్ లో కూడా చేసింది. సన్ టివిలో ప్రసారమైన తమిళంలో వని రాణి సీరియల్ లో కూడా ఆమె నటించింది.
ఆమె ఇప్పటివరకు 60 సినిమాలలో నటించింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ హీరోహీరోయిన్లు అందరితో కలిసి నటించింది శైలజా ప్రియ. ఆమె చిరంజీవి హీరోగా నటించిన మాస్టర్, అన్నయ్య సినిమాల్లో నటించింది. పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత, నాగార్జునతో చంద్ర లేఖా, మహేష్ బాబుతో రాజా కుమరుడు, వెంకటేష్ తో జయం మనదేరా మరియు ముఖ్యంగా హిందీ లో సూర్యవంశం సినిమా లో అమితాబ్ బచ్చన్ కూడా కలిసి నటించింది.
2012 లో ఆమె అక్కినేని నాగార్జున యొక్క అత్యంత ప్రశంసలు పొందిన ధమరుకం లో కనిపించింది. ఆమె ప్రభాస్ యొక్క మిర్చిలో రిచా గంగోపాధ్యాయ తల్లిగా నటించింది మరియు కేథరీన్ ట్రెసా పాత్రకు తల్లిగా ఇద్దారామాయిలాతో కనిపించింది. అయితే ఇన్నాళ్ళ సినిమా, సీరియల్ కెరీర్ లో శైలజ ప్రియ పై ఎటువంటి వివాదాలు రాలేదనే చెప్పాలి.. కానీ వివాదాలకి కేరాఫ్ అయిన బిగ్ బాస్ లోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక సహజంగానే మృదు స్వభావి అయిన శైలజ ప్రియ బిగ్ బాస్ హౌస్ లో ఎన్నిరోజులు కొనసాగుతుందో వేచి చూడాలి.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…