సెప్టెంబర్ 5వ తేదీ బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలోకి కంటెస్టెంట్స్ గా ముందుగా నుంచి సోషల్ మీడియాలో వినిపించిన పేర్లలో దాదాపు చాలామంది కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ పేరు కూడా వినిపించింది. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి 10 వ కంటెస్టెంట్ గా షణ్ముక్ వేదికపైకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే నాగార్జున షణ్ముక్ యూట్యూబ్ కెరియర్ గురించి అడిగారు.
మొదట్లో కవర్ సాంగ్స్ చేస్తూ తన కెరియర్ ప్రారంభించిన షణ్ముక్ ఆ తరువాత వెబ్ సిరీస్ చేస్తూ ప్రస్తుతం తన ముందు ఇలా వేదికపై ఉన్నానని చెప్పుకొచ్చారు. అదే విధంగా గతంలో తాను చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఇదొక మంచి అవకాశం అని తెలియజేశారు. హౌస్ లోకి వెళ్లిన తర్వాత ప్రతి ఒక్క ప్రేక్షకుడిని సందడి చేయడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తానని వెల్లడించారు.
ఈ విధంగా హౌస్లోకి పదవ కంటెస్టెంట్ గా షణ్ముక్ అడుగు పెట్టారు. అయితే చివరి 5 గురి కంటెస్టెంట్స్ అయినా ప్రియా, లోబో, జెస్సీ, ప్రియాంక సింగ్,షణ్ముక్ మధ్య బిగ్ బాస్ పకడో పకడో టాస్క్ నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ టాస్క్ ఎలా చేయాలి… టాస్క్ నిబంధనలు ఏమిటి అనే విషయాలను చదివి వినిపించాలని బిగ్ బాస్ షణ్ముఖ జస్వంత్ కి తెలియజేసింది.
అయితే ఆ టాస్క్ కి సంబంధించిన నిబంధనలు తెలుగులో ఉండటం చేత షణ్ముక్ తనకు తెలుగు చదవడంరాదని తెలియజేశారు. ఈ విధంగా తెలుగు చదవడం రాదన్న షణ్ముక్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగువాడు అయ్యుండి కొని తెలుగు చదవటం తెలుగు రాదా అంటూ నెటిజన్లు పెద్దఎత్తున షణ్ముక్ ను ట్రోలింగ్ గురిచేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజే ఇలా నెటిజన్ల చేత ట్రోలింగ్ కి గురి కావడం గమనార్హం.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…