బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాలిటీ షో ఒకటి. కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తూ బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5వ తేదీ ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లు ఒక్కొక్కరు స్పెషల్ సాంగ్స్ ద్వారా వేదికపైకి ఎంట్రీ ఇస్తూ ఆ తర్వాత హౌస్ లోకి అడుగు పెడుతున్నారు. ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లోకి 7 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టారు ఆర్టిస్ట్ ప్రియా.
ఈమె ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో, అక్క పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. కెరియర్ పరంగా తన జీవితం ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ నిజ జీవితం మాత్రం తన జీవితం సుఖంగా సాగిపో లేదని, తనబయో డేటాని పొయెటిక్ గా వివరిస్తూ కన్నీళ్లు పెట్టించింది ప్రియా. తన జీవితంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ తన జీవితం ఎన్నో మలుపులు తిరిగిందని, తన జీవితం పూల బాటలో పయనించలేదని తెలిపారు.
ఆమె జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని, జరిగిన సంఘటన తన కూతురు మరణం అంటూ, తన మరణం తనని బాగా క్రుంగదీసిందని, తన ముద్దుల కూతురు ఇప్పటికీ తనతో లేదనే చేదు నిజాన్ని తన మనసులోనే దాచుకుంటూ బాగా కుమిలి పోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వీడియోలో తన కూతురు ఫోటోను చూస్తూ కన్నీరు పెట్టుకుంది.
అయితే తన జీవితంలో ఎదురవుతున్నటువంటి కష్టాలు అన్నింటిని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవడానికి, తన కాళ్ళపై తాను నిలబడటానికి ఇండస్ట్రీలో కొనసాగుతూ మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపును తెచ్చుకున్న ప్రియా బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు పొందిన ఈమె బిగ్ బాస్ ద్వారా ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో వేచి చూడాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…