Featured

భారీగా బరువు తగ్గిన బ్యూటీస్ ఎవరో తెలుసా? ఒకప్పటికి ఫోటోలు చూస్తే షాక్ అవుతారు..

సినిమా లేదంటే టీవీ తారలు అనగానే చాలా అందంగా ఉంటారు అనుకుంటాం. అనుకోవడం ఏంటి అది వాస్తవం కూడా. కానీ కొందరు నటీమణులు కొన్ని సందర్భాల్లో భారీగా బరువు పెరిగారు.

ఆ తర్వాత డాక్టర్ల సూచనల మేరకు భారీగా బరువు తగ్గారు. ఇంతకీ పదుల కేజీల బరువు తగ్గిన స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

అనుష్క

తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క.. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. సుమారు 100 కిలోలకు దగ్గర అయ్యింది. ఆ తర్వాత బాహుబలి మూవీ కోసం భారీగా బరువు తగ్గింది.

నయనతార

టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ కూడా ఒకప్పుడు బాగా బరువు ఉండేది. కానీ జిమ్ లో కుస్తీలు పట్టి బాగా వెయిట్ లాస్ అయ్యింది.

కీర్తి సురేష్

మహా నటి సినిమా ద్వారా అలనాటి మహానటి సావిత్రిని అచ్చు గుద్దినట్లు టాలీవుడ్ తెరమీద కనిపించేలా చేసిన ఈ అమ్మడు కూడా చాలా బరువు తగ్గింది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు చాలా స్లిమ్ గా మారిపోయింది.

భారతీ సింగ్

ప్రముఖ టీవీ తార భారతీ సింగ్ కేవలం 10 నెలల్లో 16 కేజీలు తగ్గింది. 91 కిలోల నుంచి 76 కిలోలకు తగ్గింది. తాను ఎప్పుడూ 12 గంటలకు భోజనం చేస్తానని చెప్పింది. సాయంత్రం 7 గంటల తర్వాత ఏమీ తిననని చెప్పింది.

కరణ్ జోహార్

కరణ్ జోహార్ కూడా ఒకప్పుడు చాలా బరువు ఉండేవాడు. తన ఆరోగ్యం ద్రుష్ట్యా చాలా వర్కౌట్స్ చేసి బరువు తగ్గాడు. కేవలం 4 నెలల వ్యవధిలో 17 కిలోల బరువు తగ్గాడు.

సారా అలీఖాన్

సారా అలీఖాన్ తాజాగా ఇన్ స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. అది తను గతంలో ఎంత లావుగా ఉన్నట్టు చూపించింది. అప్పుడు తను 96 కిలోలు ఉండేది. ఆ తర్వాత తను చాలా బరువు తగ్గింది.

అలియా భట్

ఈమె కూడా అప్పట్లో చాలా బరువు ఉండేది. కానీ సినిమాల్లోకి రావాలని బలంగా ఫిక్స్ అయ్యాక.. 20 కిలోలు వెయిట్ లాస్ అయ్యింది. ఆ తర్వాత స్లిమ్ అయ్యి సినిమాల్లోకి వచ్చింది.

భూమి ఫెడ్నేకర్

ఈమె తొలి సినిమా సమయంలోనే బాగా బరువుగా ఉండేది. ఆ తర్వాత తను 89 కిలోల నుంచి 57 కిలోలకు తగ్గింది. 32 కిలోల బరువు కూడా కేవలం 6 నెలల్లోనే తగ్గడం విశేషం.

రాం కపూర్

ఇతడు కూడా భారీగా బరువు తగ్గాడు. ఒకప్పుడు భారీ దేహంతో ఉన్న ఇతడు కఠోర శ్రమతో చాలా వెయిట్ లాస్ అయ్యాడు.

పరిణితి చోప్రా

ఈమె కూడా ఒకప్పుడు చాలా బరువు ఉండేది. కానీ ఆ తర్వాత భారీగా బరువు తగ్గి స్లిమ్ గా మారింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago