Featured

పరమ ఓల్డ్ ఫార్ములాతో తలైవర్‌కు హిట్ ఎలా ఇద్దామనుకున్నారు..?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ఒక్క తమిళ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉండే క్రేజ్, రేంజ్..అసాధారణం. ఆయన సినిమా రిలీజ్ అంటే తమిళ ఇండస్ట్రీలో అభిమానులు చేసే హంగామా, హడావుడి మాటల్లో చెప్పలేరు. ఆ రోజు ఆఫీసులు బంద్, కాలేజీలు, స్కూళ్ళు బంద్..కొన్ని కంపెనీలు తమ ఎంప్లాయిస్‌కు టికెట్స్ ఇచ్చి మరీ సినిమాకు పంపుతారు. అది తమిళనాడులో తలైవర్ సత్తా. రజనీ స్టైల్ మరో హీరోకి రాదు. ఆయన చెప్పే డైలాగ్ మాడ్యులేషన్ ఇంకొకరు ఇమిటేట్ చేయలేదు.

అందుకే సూపర్ స్టార్ రేంజ్‌ను ఇప్పటి వరకు ఎవరూ బీట్ చేయలేకపోయారు. బాబా సినిమా సమయంలో ఇదే నా చివరి సినిమా అంటే ఇండస్ట్రీలతో పాటు..దేశవ్యాప్తంగా అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతగా బాధపడ్డారో చెప్పలేము. కానీ బాబా సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో ఓ భారీ హిట్ కొట్టి సినిమాలు మానేద్దామనుకున్నారు. కానీ ఆయన మనసు మార్చుకొని మళ్ళీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. శివాజీ సినిమా లాంటి భారీ హిట్ తర్వాత మళ్ళీ రోబో మూవీతో భారీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చేసిన రోబో 2.ఓ తీవ్రంగా నిరాశపరచింది.

అంతేకాదు యంగ్ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ చేసిన కబాలి, కాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. ఆ తర్వాత వచ్చిన పేట, దర్బార్ సినిమాలు కూడా రజనీకాంత్‌కు కనీసం యావరేజ్ హిట్ కూడా ఇవ్వలేకపోయాయి. ఇలా రజనీ చేసిన సినిమాలు వరుసగా బక్సాఫీస్ వద్ద ఫ్లాప్ సినిమాలుగా నమోదవుతుండటంతో..అభిమానులు కూడా బాగా నిరాశ చెందారు. దాంతో ఈసారి ఎలాగైనా ఓ భారీ హిట్ కొట్టి తన సత్తా చాటాలనుకున్నారు తలైవర్.

అందుకే తెలుగువాడైన దర్శకుడు శివ గత కొంతకాలంగా తమిళ ఇండస్ట్రీలో వరుసగా సూపర్ హిట్స్ ఇస్తూ వస్తున్నాడు. అజిత్ కుమార్‌కు బ్యాక్ టు బ్యాక్ మాస్ ఎంటర్‌టైనర్స్‌తో భారీ కమర్షియల్ హిట్స్ ఇచ్చాడు. అదే రజనీకాంత్ అవకాశం ఇచ్చేలా చేసింది. శివకు ఉన్న క్రేజ్.. అతని మేకింగ్ స్టైల్ నచ్చి రజనీకాంత్ అణ్ణాత్త సినిమా అవకాశం ఇచ్చారు. శివ, రజనీ కాంబినేషన్ అనగానే అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలను దర్శకుడు ఎప్పటికప్పుడు పెంచుతూ వచ్చాడు.

అయితే తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డివైడ్ టాక్‌ను తెచ్చుకుంది. శివ తీసుకున్న కథ పరమ రొటీన్ కావడంతో ప్రేక్షకులను మెప్పించలేదని చెప్పుకుంటున్నారు. అన్నా – చెల్లి మధ్య ఎమోషనల్ డ్రామా అనే కథాంశాలు ఇప్పటికే కోకొల్లలు వచ్చాయి. వాటిలో హిట్ సినిమాలున్నాయి..ఫ్లాప్ సినిమాలూ ఉన్నాయి. ఇలాంటి అరిగిపోయిన పాయింట్‌ను రజనీ మీద ప్రయోగించడం వల్లే అణ్ణాత్త సినిమాకు నెగిటివ్ రివ్యూస్, కామెంట్స్ వస్తున్నాయి. అభిమానులు పెట్టుకున్న అంచనాలు తాజాగా వచ్చిన అణ్ణాత్త ( పెద్దన్న ) కూడా తారుమారు చేసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago