Featured

జీవితకి డైరెక్షన్ తెలీదు.. ఆయన సపోర్ట్ చేశారు కాబట్టే నెట్టుకొచ్చింది..!

జీవిత రాజశేఖర్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె అతి చిన్న వయసులోనే నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. జస్ట్ ప్లస్ టు చదువుతున్నప్పుడే ప్రముఖ తమిళ దర్శకుడు టి.రాజేందర్ ఆమెకి హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఆయన సినిమాలో నటించే హీరోయిన్స్‌కు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. అంతేకాదు..డైరెక్టర్ టి.రాజేందర్ ఒక అమ్మాయిని హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారంటే మిగతా దర్శక, నిర్మాతల.. హీరోల దృష్ఠి ఆమె మీద పడేది. అలాగే జీవితను పరిచయం చేస్తున్నారనగానే తమిళ మేనేజర్స్ అంతా ఆరా తీశారు.

జీవిత అసలు పేరు పద్మ. అయితే ఆ పేరు మరీ రొటీన్‌గా ఉందని టి.రాజేందర్ తన మొదటి సినిమా సమయంలోనే నీ పేరు మార్చేద్దం అని అన్నారట. అలా పద్మ కాస్త జీవితగా మారింది. జీవిత అనే పేరుతో అప్పటి వరకు ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ లేకపోవడం.. పేరులో మంచి సౌండింగ్ ఉండటం.. ఇలా అన్నీ జీవితకి బాగా కలిసి వచ్చాయి. మొదటి సినిమా రిలీజ్ కాకుండానే 5 సినిమాలకి జీవిత సైన్ చేసింది. అలా తెలుగమ్మాయి అయినప్పటికీ జీవిత తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి ఒకే ఏడాదిలో 5 సినిమాలకు సైన్ చేయడం విశేషం.

ఈ సినిమాలతో టాలీవుడ్ మేకర్ ఎం.ఎస్.రెడ్డి గారి దృష్ఠిలో పడింది జీవిత. ఓసారి ఆమెను హైదరాబాద్‌కు పిలిపించుకొని మాట్లాడారు. తెలుగు బాగా చదువుతావా అని అడుగుతూ ఓ సీన్ పేపర్ ఇచ్చారు. ఆ పేపర్‌లో ఉన్న డైలాగ్స్‌ను జీవిత చక్కగా చదవడంతో బాగా ఇంప్రెస్ అయిన ఎం.ఎస్.రెడ్డి ..నా సినిమాలో నువ్వే హీరోయిన్ అని చెప్పారట. అలా జీవిత తెలుగులో చేసిన మొదటి సినిమా తలంబ్రాలు. ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా అటు జీవితకి, ఇటు రాజశేఖర్‌కి లైఫ్‌లో మైల్ స్టోన్ మూవీగా  మిగిలింది.

అలా కొన్ని సినిమాల తర్వాత జీవిత – రాజ శేఖర్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సొంత నిర్మాణ సంస్థను స్థాపించి రాజశేఖర్ హీరోగా సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో తమిళంలో అగ్ర దర్శకుడు బాలా తెరకెక్కించిన సేరు సినిమా తెలుగు రైట్స్ జీవిత – రాజశేఖర్ దక్కించుకున్నారు. ఈ సినిమా తమిళ వర్షన్‌లో విక్రమ్ నటించి బాగా మెప్పించాడు. తెలుగులో కూడా అలాంటి పేరు రావాలని ఇందులో నటించడానికి రాజశేఖర్ ఆసక్తి చూపించాడు. కానీ దర్శకుడు సెట్ కాలేదు. ఎవరైనా వచ్చినా కూడా కథలో మార్పులు చేద్దామని అన్నారట.

కానీ రాజశేఖర్‌కు కథను ఏమాత్రం మార్చడం ఇష్టం లేదు. దాంతో నువ్వే డైరెక్ట్ చేయి అని జీవితను ఆయన ఎంకరేజ్ చేశారు. అయితే జీవితకు డైరెక్షన్ తెలీదు. దాంతో పూర్తిగా సినిమాటోగ్రాఫర్ హరి అనుమోలు మీద ఆధారపడి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఎలాంటి ఫీల్ కావాలి..షాట్ రేంజ్ ఎంత ఉండాలి అనేవి చెప్పగలను గానీ అంతకంటే నాకేమీ తెలీదని సినిమాటోగ్రాఫర్‌తో నిర్మొహమాటంగా జీవిత చెప్పారు. అలా ఆయన సపోర్ట్‌తో జీవిత.. రాజశేఖర్ హీరోగా శేషు సినిమాను తెరకెక్కించారు. కళ్యాణి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి వసూళ్ళను రాబట్టి జీవిత సంస్థకు లాభాలను తెచ్చిపెట్టింది.      

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago