ఎన్నో సినిమాలలో స్టార్ హీరోయిన్గా నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న రోజా ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఒకవైపు రాజకీయాలలో ఎంతో చురుగ్గా ఉంటూనే బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న రోజా పై హైపర్ ఆది తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
సాధారణంగా ఏదైనా పండుగలు వస్తే ఈ టీవీ కార్యక్రమం స్పెషల్ ఈవెంట్ చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా ఈ టీవీ తగ్గేదేలే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోజా, ఇంద్రజ, పూర్ణ, ప్రియమణి ఇతర నటీనటులు పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా సైగల ద్వారా సినిమా పేర్లను తెలియచేయాలి అనే టాస్క్ చేశారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది సైగలు చేయడంతో అతని టీమ్ సభ్యులు సరిగ్గా సినిమా పేర్లను చెప్పారు. ఇలా హైపర్ ఆది అండ్ టీమ్ సినిమా పేర్లను కరెక్ట్ గా చెప్పడంతో ఈ విషయంపై రోజా స్పందించారు.
ఈ క్రమంలోనే రోజా మాట్లాడుతూ మీరు అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండానే ఆడారు అంటూ తెలిపారు. ఈ మాటకు హైపర్ ఆది మాట్లాడుతూ… ఆ.. మీరు ఇచ్చేది మాత్రమే ఎక్స్ప్రెషన్స్ మేము ఇచ్చేది ఎక్స్ప్రెషన్ కాదు.. ఏం మాట్లాడుతున్నావ్? అంటూ అందరి ముందు రోజాపై గట్టిగా అరిచాడు. హైపర్ ఆది ఎలా ఒక్కసారిగా రోజాపై అరవడంతో అందరూ షాక్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…