అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ పూరి, కేతికశర్మ జంటగా నటించిన రొమాంటిక్ చిత్రం అక్టోబర్ 29 రేపు విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసి ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీమియర్ షోను దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దంపతులు, బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బొమ్మరిల్లు భాస్కర్, హరీష్ శంకర్,మెహర్ రమేష్ వంటి దర్శకులు ఈ సినిమా ప్రీమియర్ షోను చూశారు.
ఇక ఈ సినిమా చూసిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను ఇప్పుడే చూశాను చాలా అద్భుతంగా ఉంది. రొమాంటిక్ సినిమా గురించి ఏదైనా వంక పెడితే యూత్ గొడవ చేస్తారేమో… ముసలోడు అయిపోయావు.. నీకేం తెలుస్తుందని యువత నాతో గొడవకు దిగుతారు అంటూ రాజమౌళి ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
అనిల్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని ఆకాశ్, కేతిక జంట అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా రాజమౌళి తెలియజేశారు. ఇకపోతే ఆకాష్ బాల నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా అతనికి మరొక మెట్టు పైకి ఎక్కించిందని ఇండస్ట్రీకి మరొక టాలెంటెడ్ హీరో దొరికాడని ఆకాష్ పూరి పై ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం తనకు ఎంతగానో నచ్చిందని రాజమౌళి సినిమా గురించి తెలియజేశారు. ఇక ఈ సినిమాని పూరి జగన్నాథ్ చార్మి సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…