ఒక సినిమాలో పంచ్ డైలాగులు చాలా కాలం వినిపిస్తుంటాయి. ఒక సినిమాలో సీన్ గురించి చాలా కాలం మాట్లాడుకునే అభిమానులు ప్రేక్షకులు చాలామంది ఉంటారు. అలాగే కొన్ని క్లాసిక్ సినిమాల గురించి, కామెడీ ఎంటర్‌టైనర్స్ గురించి..సినిమా షూటింగ్స్‌లో జరిగిన సంఘటనల గురించి ఏళ్ళతరబడి మాట్లాడుకుంటుంటారు. అయితే ఇది సినిమా రిలీజ్ తర్వాత ఎన్నేళ్ళు మాట్లాడుకున్నా అది ఓ జ్ఞాపకంలా మిగులుతుంది.
అదే సినిమా రిలీజ్‌కు ముందుకు మాట్లాడుకుంటే పబ్లిసిటీ అవుతుంది. అదే పబ్లిసిటీ పుష్ప సినిమాకు ఒకే ఒక్క పదంతో విపరీతంగా వచ్చేస్తోంది. అదే తగ్గేదే లే అనే పదం. పుష్ప సినిమా నుంచి పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాత్రను పరిచయం చేస్తూ చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ చూస్తే ఎవరికైనా గూస్‌బంస్ వచ్చేయాల్సిందే. స్టైలిష్ స్టార్‌ను కాస్తా ఐకాన్ స్టార్‌గా మార్చేశాడు దర్శకుడు సుకుమార్.
అయితే ఐకాన్ స్టార్ అని ఇమేజ్ మార్చినప్పటికీ బన్నీని మాత్రం ఊరమాస్ అంటే ఊరమాస్ అవతారంలో చూపించబోతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ లుక్ చాలా వైల్డ్‌గా అనిపిస్తోంది. ఓ లారీ డ్రైవర్ ఎలా ఉంటాడో అలా బన్నీ మేకోవర్ మార్చేసిన సుకుమార్..తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చాడు. ఒక కొత్త రకమైన మేనరిజాన్ని పుష్ప సినిమాలో చూపించబోతున్నాడు. ఇప్పటికే అల్లుఅర్జున్ తగ్గేదే లే అంటూ ఇచ్చిన ఓ సిగ్నేచర్ మూవ్‌మెంట్ ఊహించ విధంగా ట్రెండ్ అయింది.
సూటిగా చూస్తూ గడ్డం కిందనుంచి చేతిని ఒకవైపు తిప్పుతూ తగ్గేదేలే అని చెప్పిన పుష్ప రాజ్ డైలాగ్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఓ వైరల్ ఫీవర్‌లా పట్టుకుంది. ఏ షోలో చూసిన ఇదే డైలాగ్‌ను వాడేసుకుంటున్నారు. బన్నీ కూడా తగ్గొద్దు అంటూ ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. సుకుమార్ రాసిన ఈ ఒక్క డైలాగ్ సినిమా రేంజ్ ఏంతో తెలుపుతోంది. రంగస్థలం తర్వాత సుకుమార్ నుంచి వస్తున్న పుష్ప మూవీ పాన్ ఇండియన్ రేంజ్‌లో భారీ మాస్ హిట్ అందుకోబోతోందని ఇప్పటికే అభిమానులు ఇండస్ట్రీ వర్గాలు ఫిక్సైపోయాయి.
డిసెంబర్ 17న భారీ స్థాయిలో 5 భాషలలో రిలీజ్ కాబోతున్న పుష్ప ది రైజ్ పార్ట్ 1 సుకుమార్‌కు అల్లు అర్జున్‌కు బాలీవుడ్‌లో మంచి క్రేజ్ అండ్ మార్కెట్‌ను తెచ్చిపెడతాయని చాలా నమ్మకంగా ఉన్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ – ముత్యం శెట్టి మీడియా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సమంత ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతోంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే రిలీజైన సాంగ్స్ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…