Featured

రేలంగి మరణించడంతో సహ నటి గిరిజ కెరీర్ మొత్తం తారుమారై ఆస్థులు పోయి అప్పుల్లో కూరుకుపోయింది.. చివరికి ఎలాంటి పరిస్థితుల్లో మరణించారంటే..?

సినిమా ఇండస్ట్రీలో సహ నటీ నటులు వారితో ఉండే బంధం బయట ప్రపంచానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంటుంది. సినిమాలలో ప్రేమికులుగా కనిపించే హీరో, హీరోయిన్స్‌ని గానీ..ఇద్దరి కమెడియన్స్‌ని గానీ..లేదా వరుసగా సినిమాలలో జత కట్టి హిట్ పెయిర్‌గా పేరు సంపాదించుకున్న వాళ్ళను చాలామంది ప్రేమికులుగానో, పెళ్ళి చేసుకుంటే బావుంటదనే భావనలోకి వచ్చేస్తారు. ఎందుకంటే ఆ హిట్ పెయిర్ సిల్వర్ స్క్రీన్ మీద అంతగా అలరిస్తారు. నాలుగు సినిమాలలో కలిసి నటించిన ఏ నటీ నటుల విషయంలో అయినా ప్రేక్షకులకి ఇలాంటి భావన రావడం సహజం.

అప్పట్లో ఎన్.టి.ఆర్ – సావిత్రి, ఏ.ఎన్.ఆర్ – సావిత్రి, ఏ.ఎన్.ఆర్ – జమున, ఎన్.టి.ఆర్ – జమున..రాజబాబు – రమా ప్రభ, చలం – రమాప్రభ, రేలంగి – గిరిజ లాంటి హిట్ పెయిర్‌కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. అందుకే దర్శక, నిర్మాతలు కూడా వీరిని ప్రధానంగా చేసుకునే కొన్ని సన్నివేశాలు సినిమాలలో తప్పకుండా ఉండాలని రచయితల వద్ద పట్టుబట్టేవారు. అలాంటి స్టార్ కపుల్ గనక స్క్రీన్ మీద కనపడి సందడి చేస్తుంటే థియేటర్స్‌లో ఆడియన్స్ ఫీలయ్యేది వేరే లెవల్. హీరో హీరోయిన్స్ స్క్రీన్ మీద నటిస్తుంటే కొందరు వారిలో తమని తాము ఊహించుకుంటూ..మరో లోకంలోకి వెళ్ళి వస్తారు.

ఇక ఇదే క్రమంలో ఆనాటి క్రేజీ కపుల్ అంటే రేలంగి – గిరిజ. వీరి కాంబినేషన్‌ని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఎన్ని సినిమాలలో నటించినా వీరికి ఓ ప్రత్యేక స్థానం ఉండేది. అయితే అదే తర్వాత గిరిజకి శాపంగా మారుతుందని ఊహించలేకపోయింది. 1950 నుంచి 1960 దశకాల్లో తనకి తిరుగంటూ లేకుండా ఏకచత్రాధిపత్యంగా సినీ ఇండస్ట్రీని ఏలిన హాస్య మహారాణి గిరిజ. అప్పట్లో కామెడీ పాత్రలంటే కేరాఫ్ అడ్రస్‌గా ఆమె నిలిచారు. ఎంత పెద్ద స్టార్స్ ఉన్నా కామెడీ పాత్రంటే మాత్రం దర్శక, నిర్మాతలకి కావాల్సింది గిరజ మాత్రమే.

అంతగా తన హాస్యంతో థియేటర్స్ దద్దరిల్లేలా చేసేవారు. పరమానందయ్య శిష్యులు అనే సినిమాతో అక్కినేని నాగేశ్వరరావు సరసన హీరోయిన్‌గా సినీరంగ ప్రవేశం చేశారు. తర్వాత పాతాళభైరవి చిత్రంలోని ‘నరుడా ఏమి నీ కోరిక’ అనే ఒకే ఒక్క డైలాగ్ తో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. అప్పటి ప్రముఖ హాస్యనటుడు రేలంగితో జతకట్టిన తర్వాత ఆనాటి హీరో-హీరోయిన్లకు సమానంగా పాపులారిటీని సంపాదించుకున్నారు. ‘అన్నపూర్ణ’, ‘గుడిగంటలు’, ‘అప్పుచేసి పప్పుకూడు’,
‘జగదేకవీరుని కథ’, ‘ఆరాధన’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్నారు.

ఒకవైపు హాస్యనటిగా నటిస్తూనే, మరోవైపు అక్కినేని నాగేశ్వరరావుతో వెలుగునీడలు, ఎన్.టి.రామారావుతో మంచి మనసుకు మంచిరోజులు, జగ్గయ్యతో అత్తా ఒకింటి కోడలే, శివాజీగణేశన్ తో మనోహర, హరనాథ్ తో మా ఇంటి మహాలక్ష్మి, చలంతో కులదైవం, జె.వి.రమణమూర్తి తో ఎం.ఎల్.ఏ వంటి స్టార్స్‌తో కలిసి హీరోయిన్‌గా నటించారు. గిరిజకు సి.సన్యాసిరాజు అనే సినీ దర్శకుడితో పెళ్లి జరిగింది. గిరిజ భర్త సన్యాసిరాజును నిర్మాతను చేయడానికి ఎంతగానో ప్రయత్నించారు. అనుకున్నట్టుగానే విజయగిరి ధ్వజా ప్రొడక్షన్స్‌ అనే చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి 1969లో ఎన్టీఆర్, కాంచన, అంజలితో ‘భలే మాస్టారు’ సినిమా తీశారు.

ఈ సినిమా ఆశించినంతగా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, చంద్రకళతో ‘పవిత్ర హృదయాలు’ తీశారు. ఆ సినిమా కూడా ఫ్లాప్‌గా మిగిలింది. దాంతో గిరిజ సంపాదించిన ఆస్థులన్నీ పోగొట్టుకున్నారు. మద్రాసులో కొనుక్కున రెండంతస్థుల విశాలమైన భవనం అప్పుల కారణంగా చేజారిపోయింది. ఇక ముఖ్యంగా తన సహ నటుడు రేలంగి మరణించిన తరువాత గిరిజకు సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో సొంత ఇంటిని కూడా కోల్పోయి చివరకు చిన్న అద్దె గదిలోకి మారే పరిస్థితికి వచ్చారు. పూట గడవని స్థితికి వచ్చారు. రాజశ్రీ,  సుజాత వంటి సహనటీమణుల ఆదరణతో కొంతకాలం ధీన పరిస్థిని నెట్టుకొచ్చిన గిరిజ ఆ తర్వాత మృతి చెందారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago