Featured

సమంత ఓకే అంటే సరిపోతుందా.. వాళ్ళు రావాలి కదా..?

సమంత గురించే గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో గానీ, సోషల్ మీడియాలో గానీ, ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్‌లో గానీ ఒకటే చర్చలు. అంతగా ఇష్టపడి పెళ్ళి చేసుకున్నవారు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అని. దీనికి సరైన సమాధానం మాత్రం అటు సమంత గానీ, ఇటు నాగ చైతన్య గానీ నోరు తెరిచి చెప్పలేకపోతున్నారు. గత నెలరోజులకి పైగా సమంత, నాగ చైతన్య విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చాయి. దానికి నాగ చైతన్య వైపు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోయినా కూడా సమంత వైపు నుంచి మాత్రం హింట్స్ ఇస్తూనే వచ్చింది.

తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో సమంత పెట్టిన పోస్టులతోనే 50 పర్సెంట్ అందరికీ అర్థమైంది. అయితే నాగ చైతన్య నటించిన లవ్ స్టోరి సినిమా రిలీజ్ డేట్ దగ్గర ఉండటంతో విడాకుల విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారట. సినిమా రిలీజయ్యాక అందరూ అనుకుంది వారి పెళ్ళిరోజున అసలు విషయంలో క్లారిటీ వస్తుందని భావించారు. కానీ అంతవరకు ఆగడం ఎందుకులే అనుకున్నారేమో గానీ అక్టోబర్ 2న అందరూ అనుకున్నదే జరిగింది. సమంత, నాగ చైతన్య ఒకే పోస్ట్‌ను తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసి విడిపోతున్న విషయాన్ని కన్‌ఫర్మ్ చేశారు.  

దాంతో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. వీళ్ళు విడిపోవడానికి కారణం సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ అని ప్రధానంగా వినిపిస్తోంది. అతనితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వచ్చి వైరల్ అయ్యాయి. అప్పటి నుంచే సమంత, నాగ చైతన్యల మధ్య విభేధాలు తలెత్తాయని వార్తలు రాస్తున్నారు. అలాగే ది ఫ్యామిలీ మేన్ సీజన్ 2లో సమంత కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలను చైతూ వద్దన్నా చేసిందని మరో మాట వినిపిస్తోంది. ఇక గత కొంతకాలంగా సమంత ప్రవర్తనలో చాలా మార్పు వచ్చిందని రెండు పెద్ద ఫ్యామిలీస్‌కి చెందిన అమ్మాయి అయి ఉండి కూడా కొన్ని విషయాలలో హద్దులు మీరుతోందని చెప్పుకున్నారు.

మొత్తానికి కారణాలేమైనా సమంత, నాగ చైతన్య విడిపోయారు. ఇది వాళ్ల కుటుంబ సభ్యులకి మాత్రమే కాకుండా సన్నిహితులకి బాధకలిగిస్తోంది. ఇక సినీ తారలందరు వారికి సపోర్ట్‌గానే నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు సమంత సినీ కెరీర్ ప్లానింగ్ ఎలా ఉండబోతోందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఆమె ఒప్పుకున్న శాకుంతలం పూర్తి చేసింది. తమిళంలో నయనతార, విజయ్ సేతుపతిలతో కలిసి సినిమా చేస్తోంది. తెలుగులో కొత్తగా సైన్ చేసిందేమీ లేదనేది సమాచారం. కొన్ని కమర్షియల్  యాడ్స్ మాత్రం చేస్తూ బిజీగానే ఉందట.

అయితే ఆమె తెలుగులో కొత్త ప్రాజెక్ట్స్ వస్తే  ఓకే చెప్పడానికి సిద్దంగా ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. సమంత కోసం మేకర్స్ కూడా రెడీగా ఉన్నారనేది టాక్. కానీ నెమ్మదిగా సమంత సినీ కెరీర్ గ్రాఫ్ పడిపోతుందనేది చాలామంది అభిప్రాయపడుతున్నారు. సమంత సినిమాలకి నెగిటివ్ పబ్లిసిటీ ఉంటుందనేది ఇప్పుడు కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం శాకుంతలం సినిమా ప్రమోషన్స్ మొదలైతే గానీ ఓ క్లారిటీ రాదు. ఇక సమంత ఓకే చెప్పడానికి రెడీగా ఉన్నా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆమెతో సినిమాలు చేయడానికి మేకర్స్ వస్తారా అంటే క్వశ్చన్ మార్క్ కనిపిస్తోందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago