Featured

హీరోయిన్ స్నేహకి పెళ్లి తర్వాత సినిమాలు చేసినా ఫ్యామిలీ ఆడియన్స్‌లో విపరీతంగా గౌరవం పెరగడానికి కారణం అదే.

టాలీవుడ్‌లో యంగ్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది స్నేహ. ఆమె అసలు పేరు సుహాసిని. అప్పటికే ఈ పేరు మీద ఓ సీనియర్ హీరోయిన్, ఓ యంగ్ హీరోయిన్ ఉండటంతో సినిమాల కోసం స్నేహగా పేరు మార్చుకున్నారు. పేరుకు తగ్గట్టే తోటీ హీరో, హీరోయిన్స్‌తో ఎంతో స్నేహంగా మెలిగారు. అంతేకాదు ఒప్పుకున్న సినిమా పూర్తి చేసే వరకు కూడా స్నేహ దర్శక, నిర్మాతలను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ఇచ్చిన డేట్స్ ప్రకారం షూటింగ్‌కి హాజరయి సినిమాను పూర్తి చేస్తూ వచ్చారు. తెలుగులో స్నేహకి మంచి హిట్ సినిమాలే ఉన్నాయి.

అగ్ర దర్శకులతో కూడా సినిమాలు చేసిన స్నేహ ఎప్పుడు మంచి పాత్రలనే ఒప్పుకుంటూ వచ్చారు. తన స్థాయిని మించి ఓవర్ ఎక్స్‌ఫోజింగ్ చేసే క్యారెక్టర్స్ స్నేహ ఎప్పుడూ ఒప్పుకోలేదు. చెప్పాలంటే స్నేహ సినిమాల ఎంపికలో ఎంతో బ్యాలెన్స్డ్‌గా వ్యవహరించారు. కథకి, పాత్రకి సరిగ్గా సూటవుతాను అనుకుంటే తప్ప సినిమాను ఒప్పుకునేవారు కాదు స్నేహ. అందుకే ఆమె కెరీర్ చాలా సాఫీగా సాగింది. తెలుగులో స్నేహ హీరోయిన్‌గా చేసింది తక్కువ సినిమాలే అయినా ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. తెలుగుతనం ఉట్టిపడేలా తన కాస్ట్యూంస్ ఎంచుకొని తను చేసిన పాత్రలకి గౌరవం ఉండేలా చూసుకున్నారు స్నేహ.

రవితేజ లాంటి మాస్ హీరో సరసన వెంకీ లాంటి మాస్ ఎంటర్‌టైనమెంట్ చేసినా కూడా అందులో ఆమె పాత్ర చాలా డీసెంట్‌గా ఉండేలా చూసుకున్నారు. ఒకటి రెండు పాటల్లో తప్ప.. ఎక్కడా ఓవర్ ఎక్స్‌ఫోజింగ్ చేయలేదు. గోపీచంద్ నటించిన తొలివలపు స్నేహ నటించిన మొదటి సినిమా. ఈ సినిమా యావరేజ్‌గా ఆడినప్పటికీ తరుణ్ నటించిన ప్రియమైన నీకు స్నేహ తెలుగులో మంచి హిట్ ఇచ్చింది. తెలుగమ్మాయి సినిమాలు ఏం చేస్తుంది అనుకున్నవారికి స్నేహ మంచి ఉదాహరణ. హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు, మహారధి, వంటి సినిమాలు స్నేహకి మంచి పేరు తీసుకువచ్చాయి.

దాంతో స్నేహకు గ్లామర్ రోల్స్ కంటే కథా బలమున్న పాత్రలు చేసే అవకాశం ఎక్కువగా దక్కాయి. సంక్రాంతి, రాధాగోపాలం, పాండు రంగ వంటి సినిమాలు చేసింది. ఆ తర్వాత స్నేహ సహ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడి..ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. అయితే పెళ్ళి తర్వాత చాలామంది సినిమాలు మానేస్తారు. కానీ స్నేహ సినిమాలకి మాత్రం దూరం కాలేదు. అలాగని హీరోయిన్‌గా సినిమాలు ఒప్పుకొని హీరోలతో రొమాన్స్, డాన్సులు చేసే పాత్రలను కమిటవలేదు. పెళ్ళి తర్వాత వదిన వంటి హుందాతనమైన పాత్రలను ఎంచుకున్నారు.

అల్లు అర్జున్ సమంత నిత్యా మీనన్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నిత్యా మీనన్‌కి వదినగా నటించి ఆకట్టుకుంది. అలాగే మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కూడా చరణ్‌కి వదినగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలా పెళ్ళి తర్వాత కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ పాత్రలను ఒప్పుకున్న స్నేహ తనకంటూ మంచి గుర్తింపును, గౌరవాన్ని సంపాదించుకున్నారు. ఇక పై కూడా స్నేహ ఎలాంటి పాత్రలు చేస్తారో స్పష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి నటీమణులు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘కట్టప్ప’కు కొడుకు షాక్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు

తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…

47 minutes ago

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…

3 hours ago

ఈ ఒక్క పండు మీ గట్ నుంచి గుండె వరకు మార్పు తీసుకురాగలదా?

నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…

3 hours ago

వాట్సాప్‌లో కొత్త ప్రీమియం సబ్‌స్క్రిప్షన్? వినియోగదారులకు రాబోయే మార్పులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…

3 hours ago

మొబైల్ అలవాటు… సంతానంపై ప్రభావం? జేబులో ఫోన్ పెట్టే ముందు తెలుసుకోండి… మీ ఆరోగ్యానికి ఇది మంచిదేనా?

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…

3 hours ago

ఎండలో నల్లగా మారిన ముఖం? టానింగ్‌కు చెక్ పెట్టే నాచురల్ సీక్రెట్… పార్లర్ ఖర్చు సేవ్!

వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…

3 hours ago