టాలీవుడ్‌లో ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్‌తో పాటు నేచురల్ స్టార్ నాని, శర్వానంద్, రాజ్ తరుణ్, మనోజ్, రామ్ పోతినేని, సందీప్ కిషన్, సుధీర్ బాబు లాంటి యూత్ హీరోలు కూడా ఉన్నారు. వీరందరిలో నాని మార్కెట్ ఎప్పుడు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. నాని నిర్మాతలు భారీగా నష్ఠపోవడం అంటూ ఇప్పటి వరకు జరగలేదు. బాక్సాఫీస్ వద్ద ఒక మాదిరి హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా నిర్మాతలు ఎప్పుడూ సేఫ్ జోన్‌లోనే ఉంటారు. అందుకే నానీకి మినిమం గ్యారెంటీ హీరో అని పేరొచ్చింది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
ఇప్పుడు నాని కూడా పాన్ ఇండియన్ క్రేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి నాని సన్నిహితుడే నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. అంతేకాదు నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా శ్యాం సింగ రాయ్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 50 కోట్లని తెలుస్తోంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా నానికి ఆశించిన విజయాలు దక్కడం లేదు.
ఈ క్రమంలో నానికి టాలీవుడ్‌లో గట్టిగానే పోటీ ఏర్పడుతోంది. తనలా నేచురల్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న శర్వానంద్, శ్రీ విష్ణు, సత్య దేవ్ లాంటి వారు ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు. శర్వానంద్‌కి బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ ఉంది. అలాగే సత్య దేవ్ దాదాపు ఆరేడు సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అంతేకాదు ఇక్కడ మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్స్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అందుకుంటూనే బాలీవుడ్ సినిమాలలో కూడా సత్యదేవ్ అవకాశాలు అందుకుంటూ తన మార్కెట్ రేంజ్‌ను బాగా పెంచుకుంటున్నాడు.
ఇక శ్రీవిష్ణు ఇప్పుడు మీడియం బడ్జెట్ నిర్మాతలకి మంచి ఛాయిస్‌గా మారాడు. ఆయన నటిస్తున్న సినిమాలు మంచి ఎంటర్‌టైన్మెంట్స్‌గా పేరు తెచ్చుకుంటున్నాయి. అంతేకాదు నిర్మాతలకి కనీస లాభాలను తెచ్చిపెడుతున్నాయి. దాంతో నానితో సినిమా చేయాలనుకున్న నిర్మాతలు కూడా ఇప్పుడు శ్రీ విష్ణువైపు మొగ్గు చూపుస్తున్నారట. అందుకు కారణం నానీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద గతకొంతకాలంగా నిరాశపరచడమే. అదే సమయంలో శ్రీ విష్ణు నటించిన సినిమాలు మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంటూ తన అకౌంట్‌లో హిట్స్‌గా చేరుతున్నాయి.
శ్రీవిష్ణు కామెడీ, హ్యూమర్ తో పాటు ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తుండటం బాగా ప్లస్ అయింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి సినిమాలతో శ్రీ విష్ణుకి మంచి పేరొచ్చింది. అంతేకాదు తన మార్కెట్ కూడా బాగానే పెరిగింది. ఇటీవల వచ్చిన రాజ రాజ చోర కూడా నిర్మాతలకి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక త్వరలో ‘అర్జున ఫాల్గుణ’ అనే సినిమాతో రాబోతున్నాడు. అంతేకాదు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా శ్రీవిష్ణు చేతిలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు నానికి శ్రీ విష్ణుని గట్టి పోటీ ఇస్తున్న హీరోగా చెప్పుకుంటున్నారు.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…