ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించగా…. రష్మిక శ్రీ వల్లి పాత్రలో సందడి చేయనున్నారు.ఈ క్రమంలోనే తాజాగా శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కోసం చిత్రబృందం విడుదల చేయగా విశేషమైన ఆదరణ దక్కింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ లు, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇకపోతే ఇప్పటికే అల్లు అర్జున్ పై ఇప్పటికే ఈ సినిమా నుంచి పస్ట్ సింగిల్ విడుదల అయి ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. దాక్కో దాక్కో మేక అంటూ ఐదు భాషలలో విడుదలైన ఈ పాట విశేష ఆదరణ దక్కించుకుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా సరికొత్త అప్డేట్ విడుదల చేశారు. ఇందులో భాగంగా శ్రీవల్లి పాత్రలో నటిస్తున్నటువంటి రష్మిక పై సెకండ్ సింగిల్ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే శ్రీవల్లి సెకండ్ సింగిల్ ఎప్పుడు రాబోతుంది అనే విషయాన్ని చిత్రబృందం అధికారకంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈనెల 13వ తేదీ శ్రీ వల్లి సెకండ్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారకంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన బాణీలు విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పటికే సుకుమార్ , బన్నీ,దేవిశ్రీ కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్య, ఆర్య 2 సినిమాలోని పాటలు విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాలకు మించి పుష్ప సినిమా ఉండబోతోందని ఈ సందర్భంగా చిత్ర బృందం తెలియజేశారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…