Categories: FeaturedMovie News

మినిమం గ్యారెంటీ హీరోగా నేచురల్ స్టార్‌కి పోటీ వస్తున్న శ్రీవిష్ణు.. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్..

టాలీవుడ్‌లో ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్‌తో పాటు నేచురల్ స్టార్ నాని, శర్వానంద్, రాజ్ తరుణ్, మనోజ్, రామ్ పోతినేని, సందీప్ కిషన్, సుధీర్ బాబు లాంటి యూత్ హీరోలు కూడా ఉన్నారు. వీరందరిలో నాని మార్కెట్ ఎప్పుడు చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. నాని నిర్మాతలు భారీగా నష్ఠపోవడం అంటూ ఇప్పటి వరకు జరగలేదు. బాక్సాఫీస్ వద్ద ఒక మాదిరి హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా నిర్మాతలు ఎప్పుడూ సేఫ్ జోన్‌లోనే ఉంటారు. అందుకే నానీకి మినిమం గ్యారెంటీ హీరో అని పేరొచ్చింది. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

ఇప్పుడు నాని కూడా పాన్ ఇండియన్ క్రేజ్ కోసం గట్టిగా ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి నాని సన్నిహితుడే నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. అంతేకాదు నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమా శ్యాం సింగ రాయ్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 50 కోట్లని తెలుస్తోంది. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా నానికి ఆశించిన విజయాలు దక్కడం లేదు.

ఈ క్రమంలో నానికి టాలీవుడ్‌లో గట్టిగానే పోటీ ఏర్పడుతోంది. తనలా నేచురల్ స్టార్స్‌గా పేరు తెచ్చుకున్న శర్వానంద్, శ్రీ విష్ణు, సత్య దేవ్ లాంటి వారు ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు. శర్వానంద్‌కి బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ ఉంది. అలాగే సత్య దేవ్ దాదాపు ఆరేడు సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నాడు. అంతేకాదు ఇక్కడ మెగాస్టార్ లాంటి సీనియర్ స్టార్స్ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు అందుకుంటూనే బాలీవుడ్ సినిమాలలో కూడా సత్యదేవ్ అవకాశాలు అందుకుంటూ తన మార్కెట్ రేంజ్‌ను బాగా పెంచుకుంటున్నాడు.

ఇక శ్రీవిష్ణు ఇప్పుడు మీడియం బడ్జెట్ నిర్మాతలకి మంచి ఛాయిస్‌గా మారాడు. ఆయన నటిస్తున్న సినిమాలు మంచి ఎంటర్‌టైన్మెంట్స్‌గా పేరు తెచ్చుకుంటున్నాయి. అంతేకాదు నిర్మాతలకి కనీస లాభాలను తెచ్చిపెడుతున్నాయి. దాంతో నానితో సినిమా చేయాలనుకున్న నిర్మాతలు కూడా ఇప్పుడు శ్రీ విష్ణువైపు మొగ్గు చూపుస్తున్నారట. అందుకు కారణం నానీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద గతకొంతకాలంగా నిరాశపరచడమే. అదే సమయంలో శ్రీ విష్ణు నటించిన సినిమాలు మంచి సక్సెస్ టాక్ తెచ్చుకుంటూ తన అకౌంట్‌లో హిట్స్‌గా చేరుతున్నాయి.

శ్రీవిష్ణు కామెడీ, హ్యూమర్ తో పాటు ఎమోషనల్ సీన్స్ బాగా చేస్తుండటం బాగా ప్లస్ అయింది. ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘నీది నాది ఒకే కథ’, ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ లాంటి సినిమాలతో శ్రీ విష్ణుకి మంచి పేరొచ్చింది. అంతేకాదు తన మార్కెట్ కూడా బాగానే పెరిగింది. ఇటీవల వచ్చిన రాజ రాజ చోర కూడా నిర్మాతలకి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక త్వరలో ‘అర్జున ఫాల్గుణ’ అనే సినిమాతో రాబోతున్నాడు. అంతేకాదు మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా శ్రీవిష్ణు చేతిలో ఉన్నాయి. అందుకే ఇప్పుడు నానికి శ్రీ విష్ణుని గట్టి పోటీ ఇస్తున్న హీరోగా చెప్పుకుంటున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago