Featured

చేతిలో 30 సినిమాలు..ప్రమాదంలో వెన్నుపూసకు దెబ్బ.. తర్వాత సినిమా అవకాశాలు కోల్పోయిన నూతన ప్రసాద్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు.!!

నూటొక్క జిల్లాల అందగాడు అనగానే ఆంధ్ర ప్రేక్షకులందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు నూతన్ ప్రసాద్. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నూటొక్క జిల్లాల అందగాడు అని చెప్పే సంభాషణలు నూతన్ ప్రసాద్ ను గుర్తుచేస్తుంటాయి. 1945 కృష్ణా జిల్లాలో జన్మించిన నూతన్ ప్రసాద్ తన విద్యాభ్యాసం పూర్తిచేసి నాగార్జునసాగర్, హైదరాబాదులో ఉద్యోగం చేశారు. ఆ తర్వాత నూతన్ ప్రసాద్ నాటకాలపై అభిమానంతో సుడిగాలి, గాలివాన, కెరటాలు వంటి నాటకాల్లో వివిధ రకాలైన పాత్రను ఆయన పోషించారు.

ఆయన నటించిన మాలపిల్ల నాటకం 101 సార్లు ప్రదర్శించారు. ఆ తర్వాత తెలుగు చలన చిత్ర రంగంలోకి అడుగు పెట్టారు. నూతన్ ప్రసాద్ మొదటగా బాపు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు చిత్రంలో నటించారు. ఆ తర్వాత హాస్య, కరుణ, భయానక పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. బాపు-రమణల కలయికలో వచ్చిన రాజాధిరాజు చిత్రంలో సైతాన్ పాత్ర నూతన్ ప్రసాద్ కి ఎంతగానో పేరు తీసుకువచ్చింది. అందులో కొత్తదేవుడండి…కొంగొత్త దేవుడండీ ఈ పాటలో నూతన్ ప్రసాద్ ఆడి పాడిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది. బాపు దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం ముత్యాలముగ్గు లో నిత్య పెళ్లి కొడుకు పాత్రలో నూతన్ ప్రసాద్ నటన బాగుంటుంది.

శ్రీదేవి హీరోయిన్ గా రాణికాసుల రంగమ్మ చిత్రంలో అమాయకపు పాత్రలో నూతన్ ప్రసాద్ నటన అందరినీ అబ్బుర పరుస్తుంది. ఇలా ఆనందంగా కొనసాగుతున్న ఆయన జీవితంలోకి బామ్మ మాట బంగారు బాట అనే చిత్రంలో నటించే పరిస్థితి వచ్చింది. ఆ సినిమాలో కారులో పెట్రోలుకు బదులు సారా పోయడంతో ఆ కారు గాలిలోకి లేచే సన్నివేశం ఉంటుంది. ఆ కారులో ముందు సీట్లో రాజేంద్ర ప్రసాద్ వెనుక సీట్ లో నూతన్ ప్రసాద్ కూర్చుని ఉంటారు. షూటింగ్ లో భాగంగా కారుని గాల్లోకి గొలుసులతో ఎత్తుతారు. ఆ గొలుసులోని ఒక వరుస అప్పటికే ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. క్రేన్ తో రెండు కుదుపులు కుదిపే సరికి ఆ గొలుసు కాస్త తెగిపోవడంతో ఒక్కసారిగా గాల్లో నుంచి కారు కింద పడింది. ముందు వరసలో కూర్చున్న రాజేంద్రప్రసాద్ కాస్త దెబ్బ తగలడంతో కోమాలోకి వెళ్లారు. నూతన్ ప్రసాద్ మాత్రం ఆస్పత్రికి తరలించండి అననడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. వెన్నుపూస దెబ్బతినడంతో పూర్తిగా ఆయన వీల్ చైర్ కే అతుక్కుపోయారు.

అప్పటికే ఆయన చేతిలో దాదాపు 30 సినిమాలు ఉన్నాయి. ఒక్కసారిగా వెన్నుపూసకు దెబ్బతినడంతో మునుపటిలా కదులుతూ, నడుస్తూ నటించే అవకాశాన్ని నూతన్ ప్రసాద్ పూర్తిగా కోల్పోయారు. వివిధ రకాలైన పాత్రలతో ఎప్పుడూ బిజీగా ఉండే నూతన్ ప్రసాద్ ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా అవకాశాలను కోల్పోవాల్సివచ్చింది. ఒకవేళ అవకాశాలు వచ్చినా కుర్చీలో కూర్చుని కనిపించే జడ్జి పాత్రలో లేదా ప్రమాదానికి గురైన మరొక పాత్రలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవితో అనేక సినిమాల్లో నూతన్ ప్రసాద్ నటించారు. ఆ స్నేహంతో చిరంజీవి తరుచూ నూతన్ ప్రసాద్ ను పరామర్శిస్తూ ఉండేవారు.

సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో నూతన్ ప్రసాద్ డబ్బింగ్ వైపు వెళ్లారు. అలా ఈటీవీ లో ప్రసారమయ్యే నేరాలు-ఘోరాలు కార్యక్రమంలో తన వాయిస్ ని అందించారు. నూతన్ ప్రసాద్ వాయిస్ తో కార్యక్రమం ఎంతగానో ప్రజాదరణ పొందింది. ఓ సందర్భంలో ఆయన ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఒక ముసలమ్మ మాటలు ఆయనలో ప్రేరణ కలిగించడంతో ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నారు. కొన్ని అనారోగ్య కారణాల వలన 2011 సంవత్సరంలో నూతన్ ప్రసాద్ భువి నుండి దివికేగారు.తమ సహచర నటుడిని కోల్పోవడంతో తెలుగు సినీ పరిశ్రమ కన్నీటి పర్యంతమైంది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago