బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ కాంటాక్ట్ కేసు విషయంలో ఎన్సీబీ అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఇక కొడుకు అరెస్ట్ అయిన తర్వాత నుంచి షారుక్ ఖాన్ తన కొడుకును విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేశాడు. ఈ నేపథ్యంలోనే కోర్టు మూడు సార్లు బెయిల్ నిరాకరించింది. ఈ విషయంలో షారుక్ ఖాన్ కి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అతని అభిమానులు కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.
ఇక షారుక్ ఖాన్ కి ఆర్యన్ విషయంలో కాస్త ఊరట లభించింది. ఎందుకంటే షారుఖ్ ఇన్ని రోజుల పాటు ఏ ఘడియల కోసం అయితే ఇంతకీ ఎదురు చూశాడో ఆ ఘడియలు రానే వచ్చేసాయి. మొత్తానికి షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. అయితే ఇందుకోసం షారుఖాన్ భారీగానే ఖర్చు చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్యన్ ఖాన్ ని బయటకు తీసుకువచ్చేందుకు ఇండియాలోనే టాప్ ముగ్గురు క్రిమినల్ లాయర్స్ ను నియమించుకున్నారట.
తన కొడుకు ని బయటకు తీసుకు వచ్చేందుకు షారుఖాన్ చాలా సీరియస్ గా ట్రై చేసినప్పటికీ, ఎన్సిబి తరపు న్యాయవాది వాదనను ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ ను పలుమార్లు కొట్టివేసింది. లాయర్స్ లో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి, సతీష్ మనీష్ పాండే, అమిత దేశాయ్ లు ఉన్నారు. ఇక ఎన్సీపీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదించారు.
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ కోసం వాదించిన క్రిమినల్ లాయర్స్ సతీష్ మనిష్ షిండే రోజుకు రూ.20 నుంచి 25లక్షలు, అమిత్ దేశాయ్ రోజుకు 25 నుంచి 26లక్షలు, ఇక అందరి కంటే సీనియర్ ముకుల్ రోహత్గీ రోజుకు రూ.30 లక్షలు చార్జ్ చేస్తారని తెలిసింది. అనగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి సుమారు 25 రోజులకు పైగా ఎన్సీబీ కస్టడీలో ఉన్నారు. తాజాగా బాంబే హైకోర్టు అక్టోబర్ 28వ తేదీన షారుక్ తనయుడికి బెయిల్ మంజూరు చేసింది. అనగా ముగ్గురు క్రిమినల్ లాయర్లు 25 రోజులకు పైగా కేసును వాదించారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…