Categories: FeaturedMovie News

విజయ్ దేవరకొండకి వచ్చిన క్రేజ్ తమ్ముడు ఆనంద్ దేవకొండకి రాకపోవడానికి కారణాలివేనా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమా హీరోలకి స్టార్ ఇమేజ్ ఇంకా చెప్పాలంటే అంతకంటే భారీ క్రేజ్ తీసుకు వస్తుంది. అంతేకాదు ఓ సినిమా హీరోకి కనీసం ఓ పదేళ్ళ పాటు మరో హీరో చేరుకోలేని మైల్ స్టోన్ మాదిరిగా నిలిచిపోతుంది. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో అన్నీ అలాంటి సినిమాలే పడ్డాయి. అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి, గోకులంలో సీత, సుస్వాగతం, తొలిప్రేమ, బద్రి, ఖుషి.. ఇలా ఒకదానిని మించిన హిట్ ఒకటి వచ్చి శాశ్వతంగా ఆయన పవర్‌స్టార్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఎంతమంది స్టార్స్, పాన్ ఇండియన్ స్టార్స్ వచ్చినా పవన్ కళ్యాణ్ అనే హీరో.. పవర్ స్టార్ అనే ఇమేజ్ ఎవరూ చేరుకోలేరు.

అలాంటి మైల్ స్టోన్ లాంటి ఇమేజ్ విజయ్ దేవరకొండ దక్కించుకున్నాడు. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో చిన్న పాత్ర చేసినప్పుడే కొందరు విజయ్ ఖచ్చితంగా టాలీవుడ్‌లో పెద్ద స్టార్ అవుతాడని నమ్మారు. పెళ్ళి చూపులు సినిమా చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందిన సినిమా. చిన్న లైన్‌తో యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్‌తో రూపొందించిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది. అయితే పెళ్లి చూపులు వంటి సినిమా చేసిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ కంటెంట్ ఉన్న సినిమాతో ఓ రౌడీ హీరో అనే ఇమేజ్ తెచ్చుకుంటాడని ఇండస్ట్రీలో ఊహించిన వారెవరూ లేరు.

ఈ సినిమా కథ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్టు ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. మెడికల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ఎలా ఉంటుంది.. వాళ్ళ ఎడ్యుకేషన్ టైం ఎలా సాగుతుంది.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. ఆ సమయంలో అమ్మాయి, అబ్బాయి ఎలా రిలేట్ అవుతారు.. ఎలాంటి బాండింగ్ బిల్డ్ అవుతుంది.. అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా మారుతూ ఉంటుంది.. అప్పుడు వాళ్ళు కోరుకునే ప్రైవసీ ఏంటీ.. ఫ్యామిలీతో ఎలా మూవ్ అవుతుంటారు.. ఆ సమయంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది.. ఇలాంటి ఎన్నో గూస్ బంబ్స్ కలిగే అంశాలను అర్జున్ రెడ్డిలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చూపించారు.

వాస్తవంగా చూస్తే ఇందులో చూపించిన సన్నివేశాలన్నీ ఓ ఏజ్ గ్రూప్ వారిలో దాదాపుగా జరిగేదే. అందుకే అన్నీ వర్గాల వారు ఈ సినిమాకి కనెక్ట్ అయ్యారు. కొడుకుకి చెడ్ద అలవాట్లున్నా కూడా ఇంట్లో వాళ్ళు ఎలా అతన్ని డీల్ చేశారు.. ఎలా డీల్ చేయాలి.. బ్లడ్ బాండింగ్ ఇలా ఉంటుంది అని సినిమాను ఆ కోణంలో చూసిన అందరికీ అర్థమవుతుంది. ఇందులో హీరో క్యారెక్టర్‌కి ఉన్న ఎమోషన్స్ చాలా హై రేంజ్‌లో ఉంటాయి. వాటన్నిటినీ విజయ్ దేవరకొండ అద్భుతంగా చూపించాడు. ఇలాంటి సినిమాలో మరో హీరోను ఊహించుకోవడం చాలా కష్టం. అంతేకాదు మరో హీరోతో కంపేర్ చేయడం కూడా అనవసరం.

ఇలాంటి సినిమా చేసిన తర్వాత విజయ్ దేవరకొండతో గీత గోవిందం లాంటి క్లాసిక్ తీయాలంటే దర్శక, నిర్మాతలకి చాలా గట్స్ కావాలి. ఇక విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి హ్యాంగోవర్‌లో నుంచి బయటకి వచ్చి గీత గోవిందం చేయడం అంటే కూడా అంత ఈజీ కాదు. ఈ రెండు సినిమాలతో విజయ్ దేవరకొండ ఏంటో చూపించాడు. అందుకే పాన్ ఇండియన్ స్టార్ రేంజ్‌లో క్రేజ్ వచ్చేసింది. ఇక అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు ఎక్కువగా బాలీవుడ్‌లో తెరకెక్కుతుంటాయి. అందుకే మన హీరో అక్కడ మేకర్స్‌కి, హీరోయిన్స్‌కి బాగా ఎక్కాడు. అయితే ఆయన తమ్ముడిగా వచ్చిన ఆనంద్ దేవరకొండకి మాత్రం ఆ క్రేజ్ రావాలంటే ఎన్నేళ్ళు పడుతుందో చెప్పడం కష్ఠం.

విజయ్ దేవరకొండకి వచ్చిన మాస్ ఇమేజ్ ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండకి రావాలంటే అర్జున్ రెడ్డి వంటి సినిమా చేయాలి. అలాంటి కథలో ఆనంద్ ఫిట్ అవడని ఇప్పటికే తను నటించిన సినిమాలతో అర్థమైపోయింది. దానికోసం ట్రై చేసి కూడా కెరీర్‌కి కాస్త మైనస్ అవుతుందనే జనాల టాక్. ఆనంద్ ఎంచుకునే కథలు కూడా సాఫ్ట్‌గా ఉంటున్నాయి. ఇక బాడీ లాంగ్వేజ్.. విజయ్ దేవరకొండలో పెద్ద ప్లస్ పాయింట్ తన బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ మన జనాలకి తెగ నచ్చేసింది.. మైండ్‌లోకి బాగా ఎక్కేసింది. కానీ ఆనంద్‌లో అది పెద్ద మైనస్. స్టైలిష్ పరంగా విజయ్‌కి ఆనంద్‌కి అసలు సంబంధమే లేదు. కాబట్టి విజయ్ దేవరకి వచ్చిన రౌడీ హీరో అనే ఇమేజ్ తమ్ముడికి రావడం చాలా కష్టం అంటున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago