Featured

అప్పుడు ఒకే తరగతి గదిలో ‘క్లాస్‌మెట్స్’.. ఇప్పుడు అందరు మెచ్చే టాప్ ‘సెలెబ్రిటీస్’..!

చలనచిత్ర పరిశ్రమలో టాప్ హీరోలు, హీరోయిన్లకు మంచి క్రేజ్ ఉంటుంది. షూటింగ్ సమయాల్లో ఎక్కడకు వెళ్ళిన అందరూ గుర్తు పడుతుంటారు. ఇక ఈ సెలబ్రిటీస్ పుట్టినరోజున వారి అభిమానులు చేసే రచ్చ మాములుగా ఉండదు. వీరి అభిరుచులను, డ్రెస్సింగ్ స్టైల్, హెయిల్ స్టైయిల్‌ను కొందరు అభిమానులు గుడ్డిగా ఫాలో అవుతుంటారు. కొందరు తమ అభిమాన నటుల ఫోటోలు, పేర్లను ఏకంగా శరీరంపై పచ్చ బొట్టు వేయించుకుంటారు.

అయితే, ఫ్యాన్స్ తమకు నచ్చిన సెలబ్రెటీల పర్సనల్ లైఫ్, బాల్యం గురించి తెలుసుకోవాలనుకుంటారు. నటీనటులు కూడా వారి వ్యక్తిగత విషయాలను ఏదో ఒక సందర్భంలో ఇంటర్వ్యూల ద్వారా తెలియజేస్తుంటారు. అయితే, బాలీవుడ్ మరియు టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలుగా కొనసాగుతున్న వారు ఒకప్పుడు ఒకే స్కూల్, తరగతి గదిలో కలిసి చదువుకున్నారంటే నమ్ముతారా? అవును.. ఇదే నిజం.

నేటి సమాజంలో సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. నటీనటులతో పాటే ప్రముఖ వ్యాపార దిగ్గజాలకు చెందిన చాలా వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఒకే స్కూల్, ఒకే తరగతిలో చదువుకున్న సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగాపవర్ స్టార్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ తేజ్, రానా దగ్గుపాటి బాల్యంలో ఒకే పాఠశాలలో చదువుకున్నారట.

అలాగే నేచురల్ స్టార్ నాని, బుల్లితెర ప్రముఖ యాంకర్ ప్రదీప్ కూడా నగరంలోని ‘సెంట్ అల్ఫోన్సా’ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ, టీం ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి ఇద్దరూ అస్సాంలోని ఓ స్కూల్లో ఓకే క్లాస్‌లో కలిసి చదువుకున్నారని తెలిసింది.

ఒక్క తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ దిగ్గజ నటులైన సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌ కూడా ఒకే క్లాస్‌లో చదువుకున్నారట. ప్రస్తుతం వీరిద్దరూ బాలీవుడ్‌లో టాప్ పొజిష‌న్లో ఉన్నారు.

కేవలం సెలబ్రిటీలు మాత్రమే కాకుండా దిగ్గజ వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ, ఆనంద్ మహింద్ర కూడా తమ చిన్నతనంలో ఒకే పాఠశాలో ఒకే క్లాస్ చదువుకున్నారని తెలిసింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago