సీనియర్ హీరోయిన్ లయ ప్రేక్షకులందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగుఅమ్మాయి అయిన లయ ‘భద్రము కొడుకో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘స్వయం వరం’ సినిమాతో ఈమెకు మంచి పేరొచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన లయ.. మ్యారేజ్ తర్వాత సినిమాలు తగ్గించేసింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందంటే..
హోమ్లీ హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లయ..తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. అయితే, మ్యారేజ్ తర్వాత మాత్రం లయ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకున్న తర్వాత లాస్ ఏంజిల్స్‌లో సెటిల్ అయిన లయ.. ఆమె భర్తతో బిజినెస్ చూసుకుంటుందట. ఇకపోతే చాలా కాలం నుంచి లయ టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్తలొస్తున్నాయి. కానీ, అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ అయితే ఏం రాలేదు.
మాస్ మహారాజ రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంథోని’ చిత్రంలో మాత్రం స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది లయ. ఈ క్రమంలోనే తాను మంచి పాత్రలు లభిస్తే తప్పక సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తానని చెప్పకనే చెప్పేసింది లయ. కాగా, ఫుల్ ఫ్లెడ్జ్ క్యారెక్టర్ లభిస్తే తప్పకుండా మూవీస్‌లో రోల్స్ ప్లే చేయడానికి తాను సిద్ధమేనని లయ ఆమె సన్నిహితులతోనూ పేర్కొన్నట్లు సమాచారం. కాగా, డైరెక్టర్స్ కొందరు ఆమెను సంప్రదించే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
ఫ్యామిలీ మూవీస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న లయ నటించిన తెలుగు చిత్రాలు అన్ని కూడా దాదాపుగా సూపర్ హిట్ అయ్యాయి. ‘శివరామరాజు, టాటా బిర్లా మధ్యలో లైలా, దేవుళ్లు, మనోహరం, ప్రేమించు, అదిరిందయ్యా చంద్రం, విజయేంద్రప్రసాద్’తో పాటు పలు చిత్రాల్లో లయ కథానాయికగా నటించింది. ఇకపోతే లయ నేషనల్ లెవల్ చెస్ ప్లేయర్ కూడా. ‘స్వయం వరం’ చిత్రంలో లయ పోషించిన పాత్ర చాలా మంది ప్రేక్షకులకు బాగా ఇష్టమైనది. చూడాలి మరి.. లయ ఏ సినిమా ద్వారా టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తుందో.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…