ప్రతి వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒక కంటెస్టెంట్ తప్పకుండా బయటకు రావాల్సిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు 11 మంది హౌస్ నుంచి బయటకు వచ్చారు. దాదాపు సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ప్రతి వారం వారే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక పన్నెండవ వారంలో భాగంగా మానస్ మినహా మిగిలిన వారందరూ నామినేషన్ లో ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ వారం తప్పకుండా పింకీ, సిరి హౌస్ నుంచి బయటకు వస్తారని భావించారు.అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ అందరికీ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చి షాక్ ఇచ్చారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఎంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంటూ.. టాస్క్ ల విషయంలో తన స్ట్రాటజీ ఏంటో నిరూపించుకుంటూ బయట పెద్ద మొత్తంలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యాంకర్ రవి ఈ వారం ఎలిమినేట్ అవుతున్నట్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ వారం రవి ఎలిమినేట్ అవుతున్నారని తెలియడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు షాక్ అయ్యారు.రవి కన్నా హౌస్ లో ఎంతో వీక్ కంటెస్టెంట్ లు ఉన్నారు. వారందరూ కాకుండా రవి ఈ వారం ఎలిమినేట్ కావడంతో హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లు మాత్రమే కాకుండా ఎంతో మంది రవి అభిమానులు షాక్ అయ్యారు.
ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టాప్ ఫైవ్ లో ఉంటాడు అనుకున్న యాంకర్ రవి ఇలా మూడు వారాలు ముందే హౌస్ నుంచి బయటకు వెళుతుండటంతో ఎంతో మంది అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…