సినిమా మూకీ నుంచి టాకీ వరకు ఎప్పుడూ మూస ధోరణిలో కాకుండా సినీ గమనంలో కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగింది.ఆ క్రమంలో వచ్చిన చిత్రాలు పాతాళ బైరవి, మిస్సమ్మ, దేవదాసు, శంకరాభరణం, న్యాయం కావాలి, రాణికాసుల రంగమ్మ, ప్రతిఘటన, నిరీక్షణ, సిరివెన్నెల, లేడీస్ టైలర్, పుష్పకవిమానం, విచిత్ర సోదరులు, మట్టిమనుషులు, మాభూమి, కళ్ళు, దాసి లాంటివి సినిమాని మూస ధోరణిలోకి వెళ్ళకుండా చేశాయి. సరిగ్గా అలాంటి కోవలోకి వచ్చే చిత్రమే ‘మూడుముళ్ల బంధం’.
రాముడు రంగడు సినిమా ప్రొడక్షన్ మేనేజర్ గా పనిచేస్తున్న పొన్నతోట రఘురాం ఒకరోజు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ముత్యాల సుబ్బయ్యతో.. నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా రోజులు అయింది. ఏదైనా సొంతంగా సినిమా చేయాలని ఉందనడంతో ముత్యాల సుబ్బయ్య తను రాసుకున్న కథలో నుంచి రెండు లైన్లు చెప్పారు. ఇదివరకు వచ్చిన సినిమా కథలకు భిన్నంగా ఉండటంతో రఘురాంకు బాగా నచ్చింది. చేస్తే ఇలాంటి కొత్త సినిమా చేయాలనుకుని వయసు రీత్యా హీరో, హీరోయిన్స్ మధ్య పది సంవత్సరాలు తేడా ఉండడంతో ముందుగా ఆ పాత్రలకు బాలకృష్ణ, వాణిశ్రీని అనుకున్నారు.
ఎందుకనో అది కుదరకపోవడంతో రాజేంద్ర ప్రసాద్, మాధవిని తీసుకున్నారు. సినిమా షూటింగ్ మొత్తం రాజమండ్రి దగ్గర దాదాపు ఇరవై రోజుల్లో చిత్రీకరించారు. ఇక ఈ సినిమా కథలోకి వెళితే హీరోయిన్ పెళ్లి పీటల పై ఉండగానే పెళ్ళికొడుకు చనిపోతాడు. అందరు హీరోయిన్ ని సూటిపోటి మాటలతో నిందిస్తారు. ఇదంతా గమనిస్తున్న ఎనిమిదేళ్ల బాలుడు ఈ అమ్మాయిని అందరూ తిడుతున్నారని.. చిన్నప్పుడు బొమ్మల పెళ్లిళ్లు ఎన్ని చేయలేదని పెళ్లి పీటల పై ఉన్న హీరోయిన్ మెడలో తాళి కడతాడు. అక్కడ పెళ్లి పందిట్లో ఉన్న పెద్దలంతా అవాక్కవుతారు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై వేరే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. చివరికి ఆ హీరో ఎవరిని పెళ్లి చేసుకుంటాడన్నదే సినిమా కథ.
సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్ళింది. ఈ సినిమా ప్రివ్యూ చూసిన సెన్సార్ సభ్యులు మూడు గంటల వరకు బయటకు రాలేదు… 8 ఏళ్ల బాలుడు, 18 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి ‘శారదా చట్టం’ ప్రకారం బాల్య వివాహాలు నేరమని చెప్పారు. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు అయినప్పుడు ఇది బాల్య వివాహం ఎలా అవుతుందని, మా ఉద్దేశ్యం బాల్యవివాహాలను ప్రోత్సహించడం కాదని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సెన్సార్ సభ్యులతో వాదించారు.
దాదాపు మూడు నెలలు సెన్సార్ సభ్యులతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య పోరాడారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి సినిమా 1980 డిసెంబర్ 6న మూడుముళ్ల బంధం సినిమా విడుదలైంది. యాంటీ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు. ముత్యాల సుబ్బయ్య తన మొదటి ప్రయత్నాన్ని క్రిటికల్ సబ్జెక్టుని ఎన్నుకోవడం సినీ ప్రముఖులకు నచ్చింది. తీసిన విధానం బాగున్నప్పటికీ ప్రేక్షకులు ఎందుకో సినిమాని ఆదరించ లేకపోయారు. కానీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య పై విమర్శకులు ప్రశంసల జల్లు కురిపించారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…