ప్రసిద్ధ నవలా రచయిత యెండమూరి వీరేంద్రనాథ్ అనే పేరు తెలియనివారు బహుశా ఎవరు ఉండరు కావచ్చు. ఆ రోజుల్లో ఒక స్టార్ హీరోకి ఉన్నంత క్రేజ్, అభిమానులు ఈ నవలా రచయితకు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈయన రాసిన నవలల్లో మొదటగా అభిలాష అనే సినిమా రూపొందించబడింది.
1981 ప్రాంతంలో ఆంధ్రజ్యోతి అనే వారపత్రికకు అభిలాష సీరియల్ ని యెండమూరి వీరేంద్రనాథ్ రాసేవారు.
హీరో చిరంజీవి గారి అమ్మగారు అంజనాదేవి ఆ సీరియల్ని ప్రతి వారం చదివేవారట అయితే అందులోని పాత్ర పేరు చిరంజీవి కావడంతో ఆ కథను చిరంజీవికి చెప్పి ఈ సినిమాగ తీస్తే నీవే నటించాలని చిరంజీవిని వాళ్ళ అమ్మగారు కోరారట. అప్పుడు చిరంజీవి చూద్దాం అని చెప్పి షూటింగ్ కి బయలుదేరి వెళ్ళాడట.
1981లో కె.ఎస్.రామారావు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ స్థాపించి తమిళ్ డబ్బింగ్ చిత్రాలను తెలుగులోకి అనువదించేవాడు. ఆ క్రమంలో తెలుగులో ఒక స్ట్రేయిట్ సినిమా చేద్దామని కథ కోసం యెండమూరి దగ్గరికి వెళ్ళినప్పుడు.. నా దగ్గర ఓ నవల కథ ఉంది. చిరంజీవి గారికైతే సరిపోతుందని యెండమూరికి చెప్పడంతో కె.ఎస్.రామారావు కూడా అదే ఆలోచనలో ఉండడంతో సరే అన్నాడు.
అయితే కథలో ప్రధానాంశం భారత శిక్షాస్మృతిలో సెక్షన్ 302 ఉరిశిక్ష అమలును తెలియజేస్తుంది. కావున అమానవీయ చర్య అయిన ఉరిశిక్షను రద్దు చేయాలని ఓ సగటు న్యాయవాది చేసే ప్రయత్నమే ఈ కథ. దీనిని విన్న కె.ఎస్.రామారావుకు ఇందులో ఒక్క కమర్షియల్ ఎలిమెంట్ కనబడలేదు.
దీనిని సినిమాగా తీస్తే ఎవరైనా చూస్తారా అనే సందేహం కె.ఎస్.రామారావుకు వచ్చింది. ఆ క్రమంలో చిరంజీవి దగ్గరికి కథను తీసుకువెళ్ళినప్పుడు తన తల్లి గారిచే ఇదివరకు ఆ కథను వినడం ద్వారా చిరంజీవి వెంటనే ఒప్పేసుకొని నిర్మాతకి డేట్స్ ఇవ్వడం జరిగింది. అలా ఓ డిఫరెంట్ కథతో సినిమాగా విడుదలైన సూపర్ డూపర్ హిట్ అయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…