సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత చిరంజీవిలో ఏదో తెలియని కొత్త జోష్ కనిపిస్తుంది. ఏ చిన్న పని చేసినా కూడా దాన్ని ఫాన్స్ తో పంచుకోవడం అలవాటు చేసుకున్నాడు మెగాస్టార్. లేటెస్ట్ గా చిరు తన కొత్త లుక్ గుండుతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సన్యాసిలా ఉన్నానా లేదా.? అంటూ ప్రశ్నించాడు మెగాస్టార్. ఉన్నట్లుండి మెగాస్టార్ కాస్తా గుండు బాస్ కావడంతో ఫాన్స్ కూడా షాక్ అయ్యారు. అదేంటి ఇలా మారిపోయాడు.. ఏదైనా కొత్త లుక్ ట్రై చేస్తున్నాడా.? లేదంటే ఇంటి దగ్గర ఉన్నాడు కదా అని కొత్తగా ట్రై చేస్తున్నాడా.? అంటూ సందేహపడుతున్నారు. అంతేకాకుండా చిరంజీవి క్యాప్షన్ కూడా సన్యాసిలా ఉన్నానా.? అని అడగడం కూడా చిత్రంగా అనిపిస్తుంది. ఏదేమైనా కూడా కోట్లాది మంది ఫాన్స్ సోషల్ మీడియాలో చిరు న్యూ ఫోటోను చూసి మెగా లుక్ అదిరిపోయింది బాసూ అంటున్నారు.
ఈ మధ్య ఎప్పటికప్పుడు కొత్త లుక్ ట్రై చేస్తూనే ఉన్నాడు చిరంజీవి. ఆ మధ్య బ్లఫ్ మాస్టర్ సినిమాను చూసి దర్శకుడు గోపీ గణేష్‌ను కలిసినపుడు మీసాలు తీసేసాడు. అప్పుడు ఆ లుక్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. లేటెస్ట్ గా గుండు చేయించుకున్నాడు. స్టైల్‌గా గ్లాసెస్ పెట్టుకుని మెగాస్టార్ షేర్ చేసిన ఈ ఫోటో చూసి మెగా ఫాన్స్ అంతా ఫిదా అయిపోయారు. వామ్మో చిరు ఏంటి ఇలా మారిపోయాడు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే ఈ లుక్ చేసింది సరదా కోసం మాత్రం కాదని తెలుస్తుంది. ‘వేదాళం” సినిమా రీమేక్ కోసమే చిరంజీవి ఇలా మారిపోయాడు. ఈ సినిమా లుక్ టెస్ట్ చేయించుకోవడం కోసమే గుండు చేయించుకున్నాడు మెగాస్టార్.
ఐదేళ్ల కింద వచ్చిన ఈ సినిమాను అప్పట్లో పవన్ హీరోగా నీసన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు నిర్మాత ఏఎం రత్నం. పూజా కార్యక్రమాలు కూడా చేసిన తర్వాత ఈ సినిమా ఆగిపోయింది. అయితే ఇదే సినిమాలో ఇప్పుడు చిరంజీవి నటిస్తున్నాడు. మెహర్ రమేష్ దీనికి దర్శకుడు అనే ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌లో అజిత్ చిన్న వెంట్రుకలతో గుండుతోనే ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్ కోసం ఇప్పుడు చిరంజీవి కూడా గుండు చేయించుకున్నట్లు అర్థమవుతుంది. ఆ లుక్ టెస్ట్ కోసమే చిరు ఇలా చేసాడంటున్నారు విశ్లేషకులు కూడా. ఆచార్య షూటింగ్ కు ఎలాగూ 3 నెలలు ఉంది కాబట్టి ఆ లోపు మళ్లీ జుట్టు వచ్చేస్తుంది. ఆ ధైర్యం తోనే మన మెగాస్టార్ గుండు బాస్ గా మారిపోయాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…