Featured

మంచు లక్ష్మి గురించి బయట ప్రపంచానికి తెలియని 12 విషయాలు ఇవే..!

మన తెలుగు చిత్ర సీమ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు ఫ్యామిలీ కి గుర్తింపు ఉందన్న సంగతి తెలిసిందే. 500 సినిమాలకు పైగా హీరో, విలన్, సైడ్ యాక్టర్ ఇలా ఎన్నో సినిమాల్లో నటించిన మోహన్ బాబును తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఆదరించారు.

ఇక ఈయన వారసత్వంగా వచ్చిన మంచు మనోజ్, మంచు విష్ణు అలాగే తన కూతురు మంచు లక్ష్మి కూడా సినిమాల్లో నటించి మెప్పించారు. ఇకపోతే మోహన్ బాబు కొడుకులు కన్న కూతురికి ఎక్కువ క్రేజ్ ఉందని చెప్పవచ్చు. ఇద్దరు అన్నదమ్ముల తో పోలిస్తే ఆవిడకు ఎంతో ఫాలోయింగ్ కూడా ఎక్కువే. అయితే మంచు లక్ష్మీ ప్రసన్న మాట్లాడే తెలుగు గురించి కొందరు విడ్డూరంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే దీనికి కారణం లేకపోలేదు. ఈవిడ చిన్నప్పుడు చదువు మొత్తం చెన్నై నగరం లోనే జరగడంతో అక్కడ అంత ఇంగ్లీష్ మీడియం అలాగే సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఉండేది. అలా కేవలం ఇంగ్లీషు, హిందీ, తమిళం భాష మాత్రమే ఆవిడ బాగా వచ్చేవి. అంతేకాదు వారి ఇంట్లో పని చేసే పని వారు కూడా పూర్తిగా తమిళం వచ్చినవాళ్లే.

ఇక మోహన్ బాబు గారికి షూటింగ్ సమయం ఎక్కువగా ఉండడంతో వారి పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువ అనే చెప్పాలి. అయితే మంచు లక్ష్మికి ఇదివరకు తెలుగు రాయడం అలాగే చదవడం రాదు. ప్రస్తుతం వస్తున్న తెలుగు ఏదైనా ఉంది అంటే అది ఆవిడ అమ్మమ్మ చలవే అని చెప్పవచ్చు. వారి అమ్మమ్మ పట్టుబట్టి తెలుగు నేర్పించడం వల్ల ఈ మాత్రమైనా తెలుగు మాట్లాడగలుగుతుంది. ఇక పదో తరగతి వరకు చెన్నై నగరంలో చదివిన లక్ష్మి మంచు ఆ తర్వాత ఇంటర్మీడియట్ కు హైదరాబాద్ లో చదవడం వల్ల కాస్త తెలుగు ఆవిడకు తెలిసింది. ఏదైనా సినిమాలో తనకు డైలాగ్ ఇస్తే దానిని హిందీలోనో లేకపోతే ఇంగ్లీష్ లో తర్జుమా చేసుకొని అప్పుడు డైలాగ్ చెప్పగలుగుతున్నారు. అందుకే ఆవిడ తెలుగు అలా వెరైటీగా ఉంటుంది.

ఇక ఈవిడ హైదరాబాద్ నగరంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది. అందుకే కాబోలు తన కాస్ట్యూమ్స్ ను తానే డిజైన్ చేసుకుంటూ ఉంటుంది. లేకపోతే ఎలా ఉండాలో చెప్పి చేయించుకుంటుంది. అంతేకాదు ఈమె ఒక యోగా టీచర్ కూడా. ఇకపోతే ఈవిడకి ఇదివరకు అసలు చీర కట్టుకోవడం రాదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ పెళ్లికి ఈవిడ చీర కట్టుకొని వెళ్ళిందట. అది చూసిన ఎంతోమంది ఆవిడకు ఆ చీరలో ఎంతో బాగున్నారని పెద్ద ఎత్తున మెసేజ్లు, ఫోన్లు వచ్చాయట. దీంతో ఆవిడ పట్టుబట్టి మరి చీర ఎలా కట్టుకోవలో నేర్చుకుందట. ఈ మధ్యకాలంలో ఆవిడ కాస్త కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంది. అందుకే ఆవిడ తన సినిమాల్లో అలాగే కొన్ని ఆల్బమ్స్ లో పాటలు తనే పాడేస్తుంది. వంట చేయడంలో బాగా ఆరితేరిన కూడా ఆవిడ పూర్తిగా వంట చేయడం మానేసింది అని చెప్పవచ్చు ఆవిడ అంత బద్ధకంగా మారిపోయింది పాపం.

ఇకపోతే మంచు లక్ష్మీ ప్రొడక్షన్ హౌస్ వారి ఆర్టిస్టులకు కచ్చితంగా పేమెంట్స్ ఇచ్చేస్తుంది. ఈ విషయంలో ఏ ప్రొడక్షన్ హౌస్ తో అయినా పోల్చిన సరే మంచు లక్ష్మి ప్రొడక్షన్స్ నెంబర్ వన్ స్థానంలో నిలబడింది. అయితే ఇది వరకు ఆవిడ అమెరికా లో నివసించిన సమయంలో ఎన్నో హాలీవుడ్ టీవీ షో లలో పాల్గొన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే మనదేశంలో లాగా అక్కడ సినిమాలకు ఇంతగా అంటూ డబ్బులు మాట్లాడుకోరు. అక్కడ అంతా పర్సంటేజ్ వ్యవహారమే నడుస్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఆవిడ నటించిన షోలు ఏమైనా ఉన్నా సరే అవి టెలికాస్ట్ అయితే అక్కడి నుంచి ఆవిడకు ఇప్పటికీ కొన్ని చెక్స్ వస్తూనే ఉంటాయి. ఇక చివరిగా మంచు ఫ్యామిలీ వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున తిరుపతి దగ్గరలో ఉన్న వారి విద్యా సంస్థలు విద్యానికేతన్ చేరుకొని అక్కడ ఎంతో సంబరంగా పండుగ జరుపుకుంటూ వారి బంధువులు మాట్లాడే వెటకారపు మాటలతో మంచు లక్ష్మి ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

telugudesk

Recent Posts

నేను నటిని.. సంఖ్యలతో కాదు ప్రతిభతో అవకాశాలు రావాలి: శివాత్మిక ఘాటు వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…

8 hours ago

బ్యాంక్ లోన్ తెలిసింది.. ఐపీఎల్‌లో ప్లేయర్ లోన్ ఏంటి? ఆర్‌సీబీ స్టార్ చెన్నై దారి పట్టాడా!

ఐపీఎల్ 2026 సీజన్‌లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…

8 hours ago

మళ్లీ అతడితో పని చేయను.. ప్రగతి సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో…

8 hours ago

హీరోయిన్ అంటే ఆమెనే.. జయసుధ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…

8 hours ago

సినిమాల కంటే కుటుంబమే ముఖ్యం.. నాదియా షాకింగ్ రివీల్

తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…

9 hours ago

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

11 hours ago