మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు కొన్నిటిలో కథ అంతగా ఉండకపోయినా కథనంతో.. మాయ చేసి మాటలతో నడిపించేస్తాడు. తెరనిండా పాత్రలను నింపేసి మంచి కామెడీ ట్రాక్‌తో లాక్కొస్తుంటాడు. చిన్న పాయింట్‌ని రెండున్నర గంటల కథగా తయారు చేసి స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్ కొడుతున్నారు. కెరీర్ ప్రారంభంలో నాలుగు నుంచి 5 గంటల రష్ ఉండేలా షూటింగ్ చేసేవారని టాక్. దాన్ని ఎడిటి చేయడానికి ఎడిటర్‌కి తల ప్రాణం తోకలోకి వస్తుందని చెప్పుకొనేవారు. స్వయం వరం సినిమాతో రచయితగా టాలీవుడ్‌కి పరిచయమయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నువ్వే కావాలి, మల్లీశ్వరీ, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు వంటి సినిమాలకి ఫ్యామిలీ మొత్తం కూర్చోని చూసే కథ మాటలను అందించారు.
యంగ్ హీరో తరుణ్ – శ్రియ జంటగా నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారి హిట్ కొట్టారు. ఆ తర్వాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రిష జంటగా అతడు సినిమాని తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా మారారు. ఈ సినిమా ఓవర్ బడ్జెట్ వల్ల నిర్మాతకి లాభాలు రాకపోయినా..ఇప్పటికీ గొప్ప సినిమాగా చెప్పుకుంటారు. హాలీవుడ్ సినిమా రేంజ్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మేకింగ్ ఉంటుంది. ఇక యాక్షన్ సీన్స్ కొన్ని హాలీవుడ్ సినిమా నుంచే తెచ్చి పెట్టాడు. మక్కీకిమక్కీ దింపాడు అనే కామెంట్స్ వచ్చినా అభిమానులు మాత్రం బాగానే ఎంజాయ్ చేశారు.
అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా జులాయి. ఈ సినిమా వచ్చి విజయవంతంగా 9 ఏళ్లు పూర్తయింది. అల్లు అర్జున్ ఈ సినిమాకి ముందు చేసిన వరుడు, వేదం సినిమాలు ఆశించినంతగా ఫలితాన్ని ఇవలేదు. అలాంటి సమయంలో ‘జులాయి’ వచ్చింది. ఫస్ట్‌హాఫ్ అదిరిపోయింది. ఈ సినిమాలో కూడా ఇంట్రవెల్ బ్లాక్ హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించాడు. అంతేకాదు ఈ పార్ట్ మొత్తం ఓ హాలీవుడ్ సినిమా నుంచి ఎత్తుకొచ్చిందే. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే బిట్టు పాయింట్ బ్లాక్‌లో దొరికిపోతాడు. కానీ అక్కడితో కథ ముగిస్తే షార్ట్ ఫిల్మ్ అవుతుందని వాంటెడ్‌గా సెకండ్ హాఫ్ నడపడానికి ఎస్కేప్ చేశారు.
సెకండాఫ్‌లో కథ మొత్తం మనకి తెలిసినట్టే సాగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది సామాన్య ప్రేక్షుకుడు చెప్పేయగలడు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మెస్మరైజ్డ్ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ని కూర్చోబెట్టాడు. పవర్‌ఫుల్ పంచ్ డైలాగ్స్‌తో ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా జులాయి తీసి సక్సెస్ అయ్యాడు. ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే వరుడు, వేదం సినిమాలలో అల్లు అర్జున్ క్యారెక్టర్ సీరియస్‌గా సాగుతుంది. కానీ జులాయిలో పూర్తి భిన్నంగా ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది. ఆయన పర్ఫార్మెన్స్ సగం సినిమాకి హిట్ కి కారణం అయింది.
కథ లేకపోయినా.. మొదటిరోజు కాస్త డివైడ్ టాక్ వచ్చినా విచిత్రంగా 40 కోట్ల వసూళ్ళు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరోయిన్‌గా నటించిన ఇలియానా పుల్లలా, పీలగా ఉన్నా.. రాక్ స్టార్ మ్యూజిక్ హైలెట్ కావడంతో పెద్దగా ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. మొత్తానికి ఆ సమయంలో బాక్సాఫీస్ వద్ద గట్టిగా లాగితే 30 కోట్లు వసూళ్ళు తెచ్చిన సినిమాలే ఉన్నాయి. కానీ రికార్డ్ బ్రేక్ స్థాయిలో 40 కోట్లను రాబట్టిన మొదటి సినిమాగా జులాయి నిలవడం విశేషం. ఇక ఈ సినిమా బుల్లితెరపై ఎప్పుడు ప్రసారమైనా ప్రేక్షకులు టీవీలకి అతుక్కుపోతుంటారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…