Categories: FeaturedMovie News

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి గురించి ఆశక్తికర విషయాలు..!

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీ నీడ నుంచి మెల్లిగా బయటపడి. తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నాడు. డ్యాన్స్‌, ఫైట్స్‌ సహా అద్భుత నటనతోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇక పర్సనల్‌ లైఫ్‌లోనూ మంచి కొడుకుగా మంచి భర్తగా తండ్రిగా మంచి మార్కులే కొట్టేస్తున్నాడు.

అల్లు అర్జున్‌ భార్య స్నేహలతా రెడ్డి కూడా తక్కువేమీ కాదు. భర్తకు తగ్గ భార్యగా మేడ్‌ ఫర్‌ బన్నీ అనిపించుకుంది. మరి అలాంటి స్నేహ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సహజంగానే అందరికీ తప్పకుండా ఉంటుంది.

వాస్తవానికి బన్నీ, స్నేహలది లవ్‌ కమ్‌ అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ అని చెప్పొచ్చు. 2011లో వీరిద్దరూ ప్రేమపక్షుల్లా విహరించి. పెద్దల ఆమోదంతో ఒక్కటయ్యారు. అయితే మొదట్లో కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. పెళ్లికి అల్లు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేకపోయినా. స్నేహ తండ్రి సిట్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఫౌండర్‌ కేసీ శేఖర్‌రెడ్డి అంగీకరించలేదు. దీంతో వారి వివాహానికి ఏడాది గ్యాప్‌ వచ్చింది. చివరికి మధ్యవర్తుల సహకారంతో ఇరు పక్షాలు పెళ్లికి అంగీకరించారు.

చిన్నప్పటి నుంచే స్నేహ ఎంతో చురుకైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీతో పాటు ఇంజినీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ని పూర్తి చేశారు. ఇండియా వచ్చిన తర్వాత తమ సిట్‌ కాలేజ్‌ విస్తరణకు కృషి చేసింది. కాలేజ్‌ అకడమిక్స్‌ అండ్ ప్లేసెమెంట్ సెక్షన్‌ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసింది. తన డైనమిజంతో… కాలేజ్ ఈవెంట్స్ లో ఆక్టివ్ రోల్‌ ప్లే చేసింది. యువతను జాగృతం చేయడానికి స్పెక్ట్రం అనే కాలేజీలకు సంబంధించిన మ్యాగజైన్‌కి చీఫ్‌ ఎడిటర్‌గా కూడా పని చేసింది. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలంటే అల్లు అర్జున్ 10వ తరగతి వరకు మాత్రమే చదివితే.. స్నేహ రెడ్డి మాత్రం బన్నీ కన్నా ఏడాకులు ఎక్కువే చదువుకుంది.

కుటుంబపరంగా అత్తామామల వద్ద స్నేహారెడ్డికి మంచి ఇంప్రెషనే ఉంది. తమ కోడలు బంగారమని వారు చెబుతారు. అంతేకాదు అయాన్, అర్హలకి తల్లిగా స్నేహా ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. ఆడుతూ పాడుతూ.. జాలీగా.. చిలిపిగా కనిపించే అల్లు అర్జున్‌కు ఇలాంటి భార్య దొరకడం నిజంగా ఆ కుటుంబం చేసుకున్న అదృష్టంగా చెబుతారు.

మరోవైపు స్నేహారెడ్డి సెల్ఫ్‌ రెస్‌పెక్ట్‌ను ఎక్కువగా కోరుకుంటుంది. తండ్రితో సంక్రమించిన ఆస్తులు, బిజినెస్‌ను, భర్తతో వచ్చిన స్టార్‌ స్టేటస్‌ను కాదనుకుని తనకంటూ ప్రత్యేకంగా ఉండాలని భావించింది.

అందుకే జూబ్లీహిల్స్‌లో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించింది. తన అభిరుచి మేరకు పికాబో అనే ఓ ఆన్‌లైన్‌ ఫోటో స్టూడియోని కొనుగోలు చేసింది. బేబి ఫొటోగ్రఫి, మెటర్నిటి ఫొటోగ్రఫి చేస్తూ తన సత్తా చాటుతోంది. ఇవండీ అల్లు అర్జున ప్రియ సతీమణి స్నేహ రెడ్డి గురించిన ఆసక్తికరమైన విషయాలు.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago