పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఆయన చాలా చిన్నగా ఉన్నప్పటికీ ఆయన పాత్రలు ప్రేక్షకులు అందరినీ కడుపుబ్బ నవ్విస్తాయి. ఖమ్మంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేసే ఈ కమెడియన్ చదువుకునే రోజుల్లోనే నాటకాలంటే ప్రాణం ఇచ్చేవాడు. ఈయనకు పెళ్లయిన తర్వాత అప్పుడప్పుడు నాటకాలు వేస్తూండేవాడు. ఇలా నాటకాలు వేయడం ఆయన భార్యకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నాటకాల పిచ్చిలో పడి ఉన్న ఉద్యోగం కాస్త ఎక్కడ పోతుందేమోనన్న భయం ఆమెలో నాటుకుపోయింది.
ఒకవేళ ఆయన నాటకం వేసిన తర్వాత విషయం ఆమెకు తెలిస్తే ఓ పదిహేను రోజుల పాటు ఇద్దరి మధ్యలో మాటలు ఉండేవికావు. అలా రోజులు గడుస్తున్నా సమయంలో ఆయన భార్యకు సౌదీ లో ఉద్యోగం రావడం జరిగింది. దాంతో వచ్చీరాని జీతంతో జీవితాన్ని నడపలేక కొన్ని నెలలపాటు లీవ్ లో ఉండి హైదరాబాద్ వెళ్లిపోవడం జరిగింది.
ఖాళీగా తిరుగుతూ సారథి స్టూడియో కి వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పటి టాప్ స్టార్ హీరో సినిమా షూటింగ్ జరుగుతుంది. షూటింగ్ గ్యాప్ లో అక్కడ కూర్చున్న ఆ నటుణ్ని పట్టుకొని ఈ సినిమాలో హీరో ఎవరు అని అడిగాడు. ఆయన నవ్వుకుని ఆ హీరో ఎవరో కాదు నేనే అని చెప్పాడు. అప్పుడు నాలుక కరుచుకున్న బాబు మోహన్ తన తప్పు తెలుసుకున్నాడు.
తమ్మారెడ్డి నిర్మాణ సారథ్యం, వాసు దర్శకత్వంలో 1979లో అమీర్ పేట్ సారథి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటున్న ‘కోతల రాయుడు’ సినిమా విరామంలో చిరంజీవి ఉపశమనం పొందుతున్న తరుణంలో అక్కడికి వెళ్ళిన బాబు మోహన్ ఆయన ఎవరు అని అడగడం జరిగింది. అప్పుడే తెలుగు తెరకు పరిచయమైన హీరో కావడం వలన బాబు మోహన్ చిరంజీవి ని గుర్తు పట్టలేకపోయారు. దాదాపు ఈ సంఘటన జరిగిన తర్వాత ఎనిమిది సంవత్సరాలకు “ఈ ప్రశ్నకు బదులేది” అనే సినిమాతో బాబు మోహన్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…