Categories: FeaturedMovie News

చక్రవాకం నటీనటులు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా ?

అసలు వెండితెరపై ఒక సినిమాను రెండు వారాలు ఆడించడానికే నిర్మాతలు నానా తంటాలు పడుతుంటారు. ఇక ఆ సినిమా యాబై రోజులకు చేరువైతే ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ కిందే లెక్క. అయితే ఇదంతా వెండితెరపై కానీ బుల్లితెరపై మాత్రం సీన్ రివర్స్. ఏదైనా ఒక సీరియల్ మొదలైందంటే. వందలకొద్దీ ఎపిసోళ్లు. వెయ్యి దాటిందంటే అదో రికార్డు. సీరియల్‌ తీయడం ఒకెత్తయితే. దాన్ని ప్రేక్షకుల మనసులకు హత్తుకునేలా మార్చడం మరొకెత్తు. ఇందులో వందకు వెయ్యి మార్కులు వేయించుకునే సీరియల్ చక్రవాకం. ఇదంత మామూలు విషయం కాదు. ఈ ఘన కార్యాన్ని సాధించడమే కాదు. వెయ్యి ఎపిసోడ్లకు పైగా పరుగులు పెట్టించి రికార్డ్ సృష్టించింది చక్రవాకం టీం.

టీవీ సీరియల్ అనగానే గుర్తుకొచ్చేలా తెలుగువాకిళ్లలో అందరినోటా నానిన సీరియల్ గా చక్రవాకంకు పేరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు మంజులా, బిందునాయుడు సిస్టర్స్. చక్రవాకం సీరియల్ 2003 నవంబర్ 3న ప్రారంభమైంది. అక్కడి నుంచీ అది సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సీరియల్స్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నా నటి నటుల గురించి ఇపుడు తెలుసుకుందాం.

ఇంద్రనీల్ వర్మ

చక్రవాకం’ హీరో ఇంద్రనీల్ గా అశేష తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా పరిచితుడు. తరువాత మంజులానాయుడి ‘మొగలిరేకులు’ సీరియల్లో కూడా హీరోగా చేశాడు. ఇంద్రనీల్ అలియాస్ రాజేశ్ బాబు పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా గుడివాడలో. చక్రవాకం సీరియల్లో నటిస్తున్నపుడే ఆ సీరియల్లో అత్తగా నటించిన గుజరాతీ అమ్మాయి మేఘనా రమ్మీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చక్రవాకం, మొగలిరేకులు సీరియల్స్ తో పాపులారిటీ వచ్చిన తరువాత చాలా సీరియల్స్ ప్రోగ్రామ్స్ తో బిజీ గా ఉన్నాడు.

ప్రీతి అమిన్

‘చక్రవాకం’ హీరోయిన్ ప్రీతి అమిన్ టీవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ అమ్మడు పుట్టి పెగింది ముంబై, తెలుగు సీరియల్స్ లోనే కాకుండా హిందీ సీరియల్స్ కూడా నటించింది. చక్రవాకం సీరియల్ తో 2006 లో వెస్ట్ యాక్టర్స్ అవార్డు వచ్చింది. ఇక ఆతరువాత ప్రీతి అమిన్ అమెరికాకు చెందిన వ్యక్తి ని పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది.

సెల్వరాజ్

చక్రవాకం సీరియల్ లో ఇక్బాల్ క్యారెక్టర్ లో బాగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు సెల్వరాజ్. ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్ లో కూడా లీడ్ రోల్ చేసాడు. ఇక ఆతర్వాత చాల సీరియల్స్, ప్రోగ్రామ్స్ తో బిజీ అయిపోయాడు సెల్వరాజ్.

లిఖిత కామిని

తెలుగు అమ్మాయి అయినా లిఖిత చక్రవాకం సీరియల్ తో బాగా పాపులర్ అయి ఆ తరువాత మొగలి రేకులు సీరియల్ లో కూడా నటించింది. ఇక్క ఆ తర్వాత పెళ్లి చేసుకొని రియల్ లైఫ్ లో బిజీ అయిపోయింది. లిఖిత కు ఒక బాబు కూడా ఉన్నాడు.


శృతి

బుల్లితెరపై చక్రవాకం సీరియల్ లో మహిళా ప్రేక్షకుల్ని మెప్పించిన గొప్పనటి శృతి. మోడలింగ్ నుంచి సీరియల్స్ వరకు తన జీవన ప్రస్థానాన్ని సాగించారు. వందకుపైగా సీరియల్స్‌లో నటించారు . రుతురాగాలు, చక్రవాకం, మొగలిరేకులు, చంద్రముఖి, కన్యాశుల్కం, శ్రావణ సమీరాలు, మమతల కోవెలలోని పాత్రలు మంచి పేరు తెచ్చుకుంది ఈ నటి. ఈమె భర్త మధుసూదన్ కూడా నటుడే, సీరియల్స్ మరియు సినిమాల్లో ఎక్కువగా విల్లన్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఇటు బుల్లి తెర అటు వెండి తెరఫై నటిస్తూ బిజీ గా ఉన్నారు ఈ కపుల్స్ .

మేధా

చక్రవాకం సీరియల్ లో మేధా చాల మంచి క్యారెక్టర్ చేసింది. ఆ తర్వాత మొగలి రేకులు సీరియల్ లో కూడా లీడ్ రోల్ చేసి ప్రేక్షకాదరణ పొందింది ఈ అమ్మడు. ఆ తర్వాత పెళ్లి చేసుకొని బిజీ అయినా కూడా సీరియల్ లో నటిస్తుంది. మేధా కి ఒక బాబు కూడా ఉన్నాడు.

సాగర్

ఈ సీరియల్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు నటుడు సాగర్. చక్రవాకం, మొగలి రేకులు టివి సీరియల్స్ రేపిన సంచలనం మాములుగా లేదు. ఆ తరువాత పలు టివి సీరియల్స్ లో నటించిన సాగర్ హీరోగా ”మాన్ అఫ్ ది మ్యాచ్” సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సాగర్ హీరోగా సిద్దార్థ అనే సినిమా చేసాడు. ఇటీవలే “షాదీ ముబారక్” అనే సినిమాలో హీరోగా నటించాడు.

పావని

చక్రవాకం సీరియల్ లో ఫ్రెండ్ క్యారెక్టర్ లో అలరించిన నటి పావని. ఈ అమ్మడు సినిమాలు కూడా చేసింది. ఇక్క ఆతర్వాత పెళ్లి చేసుకొని రియల్ లో బిజీ అయిపోయింది , పావనకి ఒక పాపా కూడా ఉంది.

లహరి

చక్రవాకం’ ఇచ్చిన కిక్‌తో కెరీర్‌ వెనక్కి చూడాల్సిన అవసరం లేకుండా ముందుకు వెళ్తుంది లహరి. . ఈ సెరల్ తర్వాత ‘మొగలిరేకులు’, ‘లయ’, ‘డాక్టర్‌ చక్రవర్తి’, ‘శుభాకాంక్షలు’, ‘ఆరాధన’, ‘ముద్దుబిడ్డ’ సీరియల్స్‌ లో నటించింది. ‘ అంతే కాదు సినిమాలో కూడా నటిస్తుంది ఈ అమ్మడు. ఇటు బుల్లి తెర పైన అటు వెండి తెర పైన బిజీ గ ఉంటుంది లహరి.

చక్రవాకం సీరియల్ లో నటించిన ఈ నటులు అందరూ జీవితంలో ఎలా స్టిర పడ్డారో చూసారు కదా.

telugudesk

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago