Featured

హీరోయిన్ గా జీవిత బాగోలేదు మార్చేయమని రాజశేఖర్ అంటే డైరెక్టర్ ఏం చేసాడో తెలుసా?

సినిమాల్లో హీరో హీరోయిన్లు ఎక్కడో పుడతారు, ఎక్కడో కలుస్తారు, వారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆపై తల్లిదండ్రులతో ఒప్పించడం లేకపోతే వారే పెళ్లి చేసుకోవడం ఇలాంటి సన్నివేశాలు చాలా జరిగే చూస్తూ ఉంటారు. అయితే ఇవి కేవలం సినిమాల్లోనే కాకుండా సినిమాల్లో నటించిన వారికి కూడా జరిగాయి అన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.

ఇక అసలు విషయానికి వస్తే… ఇలాంటి సంఘటనే మనకు నటుడు డాక్టర్ రాజశేఖర్ తన భార్య జీవితాల మధ్య కూడా జరిగింది. ఇక వీరిద్దరి పరిచయం కూడా ఒక ద్వేష పూరిత సన్నివేశంలో మొదలైందని చెప్పవచ్చు. అది ఎలా జరిగిందంటే నటుడు డాక్టర్ రాజశేఖర్ ని ఒక సినిమా కోసం తమిళ డైరెక్టర్ బుక్ చేసుకున్నాడు. అంతవరకు బాగున్నా సినిమా మొదలయ్యే సమయంలో ఆ సినిమాలో నటి జీవిత అని తెలుసుకున్న తర్వాత హీరోయిన్ గా తను బాగా లేదని ఆ సినిమా నిర్మాతలకు చెప్పాడు డాక్టర్ రాజశేఖర్. దీనితో జీవితను మార్చి ఇంకో హీరోయిని పెట్టమని చెప్పాడు.

ఇక అంతే ఆ మరుసటి రోజు ఆ సినిమా నుంచి డాక్టర్ రాజశేఖర్ ని తీసేసి మరో హీరోని పెట్టి సినిమా తీసి విడుదల చేశారు. ఇక ఇది ఇంతటితో ముగిసిపోయింది అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మరొక సినిమా తలంబ్రాలు అనే సినిమాలో వీళ్లిద్దరు మరి కలిసి నటించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు వారిద్దరూ తప్పక మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ సమయంలో జీవిత మాట్లాడిన తీరు రాజశేఖర్ కు బాగా నచ్చింది. దీంతో ఆమెతో బాగా మాట్లాడుతూ సన్నిహితంగా ఉండటం ద్వారా వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. కాకపోతే ఆ విషయాన్ని వారు ఎవరు చెప్పుకోలేదు.

అయితే కొద్దిరోజుల తర్వాత మళ్ళీ ఆహుతి సినిమాలో రాజశేఖర్ మళ్లీ జీవిత తో కలిసి నటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో రాజశేఖర్ కి పెద్ద అ యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో జీవిత హీరో రాజశేఖర్ దగ్గర ఉంటూ ఆయనకు చాలా సేవ చేసింది. ఈ విషయంలో జీవిత రాజశేఖర్ వాళ్ల తల్లిదండ్రులకు చాలా బాగా నచ్చింది.

ఇక ఇలా కొనసాగుతుండగా కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్ జీవిత విషయాన్ని ఇంట్లో ప్రస్తావించి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆయన కుటుంబం నుంచి ఎటువంటి అభ్యంతరం తెలియ చేయకపోవడంతో, అటువైపు నటి జీవిత కూడా రాజశేఖర్ ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంతో వారి పెళ్లి సుఖాంతంగా జరిగింది. ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. పెద్ద కుమార్తె ఇటీవల దొరసాని సినిమాలో హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

6 hours ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

2 days ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

2 days ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

2 days ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

2 days ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

2 days ago